Horoscope today మేష రాశి వారికి అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. మనసు చెడు విషయాలపై మళ్లకుంా జాగ్రత్త పడాలి. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. ఆంజనేయుడిని ఆరాధిస్తే మంచిది.
వ్రషభ రాశి వారికి మంచి కాలం. చేపట్టే పనుల్లో ఫలితాలు బాగుంటాయి. ఇష్టమైన వారితో ఉండటం వల్ల మానసిక సంతోషం కలుగుతుంది. ఆంజనేయుడిని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
మిథున రాశి వారికి పనుల్లో చిత్తశుద్ధి అవసరం. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. శివారాధన చేయడం వల్ల మంచి లాభాలుంటాయి.
కర్కాటక రాశి వారికి మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. గణపతి ఆరాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది.
సింహ రాశి వారికి పనులు పూర్తి చేస్తారు. శ్రమ పెరుగుతుంది. ఆర్థిక లాభాలు చేకూరుతాయి. వాదోపవాదాలకు దూరంగా ఉండండి. శని శ్లోకం చదివితే మంచిది.
కన్య రాశి వారికి మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. అనారోగ్య సమస్యలను దరిచేరనీయకండి. ఆందోళన వద్దు. దైవారాధన చేయడం మంచి ఫలితాలు కలిగిస్తుంది.
తుల రాశి వారికి మంచి కాలం. అనుకూల ఫలితాలు వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. శివాష్టోత్తరం చదవడం వల్ల మంచి లాభాలుంటాయి.
వ్రశ్చిక రాశి వారికి అనుకున్న పనులు పూర్తవుతాయి. అధికారులను సంప్రదిస్తారు. ఫలితాలు అనుకూలంగా వస్తాయి. విష్ణు ఆరాధన చేయడం శుభకరం.
ధనస్సు రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఒక శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. శ్రీరామ నామం జపించడం వల్ల మంచి ఫలితాలు రానున్నాయి.
మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో మంచి ఫలితాలుంటాయి. విష్ణు ఆలయ దర్శనం చాలా మంచి లాభాలు కలిగిస్తుంది.
కుంభ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అన్ని విషయాల్లోకలిసొస్తుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
మీన రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీలక విషయల్లో జాగ్రత్తలు పాటించాలి. భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. హనుమాన్ చాలీసా చదవడం మంచి ఫలితాలు ఇస్తుంది.