
Vitality Blast T20 : ఇంగ్లండ్ దేశవాలీ క్రికెట్ లో వైటాలిటీ టీ 20 లీగ్ జరుగుతుండగా.. క్రీడా స్ఫూర్తిని చాటే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. జూన్ 02 న హాంప్‌షైర్, కెంట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి కెంట్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేశారు.
బౌలర్ క్రిస్ వుడ్ 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా.. హాంప్ షైర్ 19.5 ఓవర్లో టార్గెట్ ను ఛేజ్ చేసింది. తద్వారా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెంట్ ఇన్నింగ్స్ చివర్లో హాంప్‌షైర్ బౌలర్ క్రిస్ వుడ్ ఫుల్ లెంత్ డెలవరీని కెంట్ బ్యాటర్ ఎవిసన్ బలమైన షాట్ ఆడాడు. బంతి డైరెక్టుగా వచ్చి నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న మాథ్యూ పార్కిన్సన్‌కు బలంగా తగిలింది. వెంటనే అక్కడే మ్యాథ్యూ పడిపోయాడు. అయితే క్రిస్ వుడ్ కు బాల్ దొరికింది. కానీ క్రిస్ క్రీడాస్ఫూర్తిని చాటాడు.
రనౌట్ చేయకుండా బాల్ తీసుకుని వెళ్లిపోయాడు. అనంతరం కిందపడిపోయిన నాన్ స్ట్రైకర్ బ్యాట్స్ మెన్ మెల్లిగా లేచి నడుచుకుంటూ వచ్చాడు. క్రిస్ వుడ్ చేసిన పనికి క్రికెట్ పండితులు అభినందిస్తున్నారు. అవుట్ అందరూ చేస్తారు. కానీ దాని విధానంలో ఎంతో తేడా ఉంటుంది. అవకాశం వచ్చిన ఔట్ చేయకపోవడం అనేది గొప్ప విషయమే.
గతంలో ఇలాంటి ఘటనే ఆస్ట్రేలియాలో జరిగింది. బుమ్రా కొట్టిన షాట్ బౌలర్ కెమెరూన్ గ్రీన్ తలకు తగలగా.. వెంటనే సిరాజ్ వచ్చి ఓదార్చాడు. అప్పుడు కూడా అందరూ సిరాజ్ స్పోర్ట్ మెన్ స్పిరిట్ ను కొనియాడారు. మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా మెచ్చుకున్నారు. అదే విధంగా సిరాజ్ కూడా ఆస్ట్రేలియా సిరీస్ లో రాణించి జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే కెంట్, హాంప్ షైర్ మధ్య జరగ్గా.. అందరూ బౌలర్ క్రిస్ వుడ్ స్పోర్ట్ మెన్ స్పిరిట్ న్ మెచ్చుకుంటున్నారు.
Impeccable sportsmanship 👏
Matt Parkinson is struck by the ball, and Chris Wood chooses not to run him out 🫡 pic.twitter.com/RijvNEpqWi
— Vitality Blast (@VitalityBlast) June 2, 2024