తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. రాష్ట్రంలో కొన్ని రోజులు ఏర్పడుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు. ఇటీవల ఏలూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పార్టీకి రాజీనామా చేశారు. అంతలోనే తిరుపతికి చెందిన మరో కీలక నేత రిజైన్ చేశారు. టీడీపీలో 15 సంవత్సరాలుగా ఉంటున్నప్పటికీ తనకు ఎలాంటి గుర్తింపు లేదని, అందుకే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంచుమించు మరోఏడాది మాత్రమే ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని చెబుతున్న పార్టీ అధినేత చంద్రబాబుకు నేతల రాజీనామా తలనొప్పిగా మారింది.
వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబుతో పాటు ఆయన జాతీయ నేత లోకేశ్ బాబు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ ప్రతిష్టతను పెంచుకుంటూ పోతున్నారు. కానీ పార్టీ నుంచి ఒక్కొక్కరు వీడుతుండడం కేడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ వైపు అధికార వైసీపీపై అసంతృప్తి కొనసాగుతుందని, వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని టీడీపీ నేతలు చెబుతున్నారు. కానీ తమకు పార్టీ అన్యాయం చేస్తుందని వెళ్లిపోవడం ఉత్కంఠగా మారింది.
ఈ నేపథ్యంలో తాజాగా తిరుపతికి చెందిన డాక్టర్ సుబ్రహ్మణ్యం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2009లో ఆ పార్టీ తరుపు శ్రీకాళ హస్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థఇ బొజ్జల గోపాల కృష్ణ గెలిచారు. ఈ క్రమంలో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో కలిపిన తరువాత సుబ్రహ్మణ్యం టీడీపీలో చేరారు. క్రీయాశీలక రాజకీయాలు చేయడంలో సుబ్రహ్మణ్యం పట్టు సాధించారు. దీంతో ఆయనకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవిని ఇచ్చారు. అయితే టీడీపీలో జాయిన్ అయి 15 సంత్సరాలు గడుస్తున్నా తనకు ఎలాంటి గుర్తింపు లేదని సుబ్రహ్మణ్యం చెప్పుకొచ్చారు. టీడీపీలో సామాజికంగా వెనుకబడిన వారికి ఆదరణ లేదని ఆరోపించారు. తాను ప్రస్తుతం ఏ పార్టీలో చేరుతానని త్వరలో నిర్ణయిస్తానని చెప్పారు. అయితే రాజీకయాల్లో సుధీర్ఘకాలం కొనసాగలని అనుకుంటున్నానని తెలిపారు.
అయితే టీడీపీ నుంచి నాయకులు వెళ్లిపోవడంపై ఆసక్తి చర్చ సాగుతోంది. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలే కారణమని అంటున్నారు. ఆయన పవన్ తో పొత్తు పెట్టుకుంటే పొత్తులో భాగంగా తమకు టికెట్ వస్తుందో లేదోనని పార్టీని వీడుతున్నట్లు సమాచారం. మరోవైపు అధికార వైసీపీలోని అసంతృప్త నేతలకు టీడీపీ మద్దతు ఇస్తూ వస్తోంది. గతంలో వైసీపీని ధిక్కరించిన రెబల్ ఎంపీ రఘురామరాజు విషయంలో చంద్రబాబు ఆయనకు మద్దతు పలికారు. ఇటీవల కోటం రెడ్డి విషయంలోనూ అదే చేయడానికి ప్రయత్నించారు. దీంతో టీడీపీలో అగ్రవర్ణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, వెనుకబడిన వర్గాలకు విలువ లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి