Prime Minister Narendra Modi మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. ఆ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు అక్కడి ప్రవాస భారతీయులు దేశంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. భారత్ లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాలను విస్తరించాలని అన్నారు. జులై 14న ఆర్థిక సంస్కరణల గురించి మోడీ మాట్లాడారు. భారతదేశంలో చేపట్టే సంస్కరణల గురించి వివరించారు.
సమాచార సాంకేతిక రంగాల్లో పెట్టుబడుకు ద్వారాలు తెరుస్తున్నట్లు ప్రకటించారు. దేశపురోగతి అభివృద్ధిపై ఆధారపడి ఉందని చెబుతున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహసంబంధాలను ప్రస్తావించారు. మన బంధం బలోపేతం కావడానికి సహకరించాలని కోరారు. రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొనాలని ఆకాంక్షించారు. భారత్, ఫ్రెంచ్ మధ్య అవినాభావ సంబంధం ఏర్పడాలని చెప్పారు.
రెండు దేశాల మధ్య 25 సంవత్సరాల భాగస్వామ్యం ఉందని చాటారు. రెండు దేశాల మధ్య ఎన్నో విషయాల్లో భావసారూప్యతలు ఉన్నాయి. ఎన్డీఏ పాలనలో రెండు దేశాల మధ్య ఎన్నో రకాల ఒప్పందాలు చేసుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. ఫ్రాన్స్ తో తమకున్న అనుబంధం కారణంగా భారీగా పెట్టుబడులు రావాలని అన్నారు. దీనికి ప్రవాస భారతీయులు కూడా సుముఖత వ్యక్తం చేశారు.
ఇతర దేశాలతో మన ప్రధాని సంబంధాలు కొనసాగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంటారు. అది అమెరికా అయినా ఫ్రాన్స్ అయినా ఏ దేశం వెళ్లినా అక్కడి వారితో మనకు మంచి లాభాలు కలిగించే విషయాల్లో ఒప్పందాలు ఖరారు చేసుకోవడం సహజం. ఇందులో భాగంగానే ఫ్రాన్స్ తో కూడా మన ప్రధాని పలు విషయాల్లో ఒప్పందాలు కుదుర్చుకుని దేశానికి మేలు చేసేందుకు నిర్ణయించుకున్నారు.