Home EXCLUSIVE Zip line : జిప్ లైన్ నుంచి జారిపడిన పిల్లాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Zip line : జిప్ లైన్ నుంచి జారిపడిన పిల్లాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

16

 Zip line : జిప్ లైన్ లో వెళ్తున్న ఓ ఆరేండ్ల పిల్లాడు 40 అడుగుల ఎత్తు నుంచి జారిపడ్డాడు. అయినా ప్రాణాలతో బయటపడ్డాడు. వీడెవడండీ.. మృత్యంజయుడే అంటారా… అవునండి.. ఇది నిజం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దీనిని చూసిన వారందరూ వామ్మో.. రియల్లీ గ్రేట్.. గాడ్ గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.  భూమి మీద నూకలు ఇంకా ఉన్నాయంటూ మరికొందరు స్పందిస్తున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడంటే..

మెక్సికోలోని… మోంటెర్రీలో ఆరేళ్ల బాలుడు జిప్ లైన్ లో వెళ్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కాని ఒక్కాసారిగా 40 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. జూన్ 25న ఈ ఘటన జరిగింది. అయితే ఈ తర్వాత ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. పార్క్ ఫండిడోరాకి సంబంధించిన అమెజోనియన్ యాత్రలో ఈ ప్రమాదం జరిగింది. సదరు పిల్లాడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 40 అడుగుల కింద ఉన్న కొలనులో ఆ పిల్లాడు పడిపోయాడు. అక్కడే ఉన్న ఓ పర్యాటకుడు క్షణాల్లో స్పందించాడు. కొలనులో దిగి ఆ ఆరేండ్ల పిల్లాడిని రక్షించాడు.

ఈ వీడియోని ట్విట్టర్ లోని @1Around_theworl అకౌంట్ లో జూన్ 27న పోస్ట్ చేశారు. ఇందులో జిప్ లైన్ లోవెళ్తున్న చిన్నారి.. కొంత దూరం వెళ్లాక..  ఎత్తు నుంచి జారి పడిపోతున్న చిత్రాలు మనకు కనిపిస్తాయి. అయినా అంత ఎత్తు నుంచి పడిన చిన్నారి గాయాలతో బతికి బయటపడడం మిరాకిల్ అని అంతా అనుకుంటున్నారు. అయితే ఆ తల్లిదండ్రులు కొంత సేపు భావోద్వేగానికి లోనయ్యారు. తమ పిల్లాడు దక్కడం ఊపిరీ పీల్చుకున్నారు. పిల్లాడిని వెంటనే కాపాడిన వ్యక్తికి ధన్యవాదాలు తెలిపారు.