A Day In My Life Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడికి కోట్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే క్షణాల్లోనే లైకులు, కామెంట్లతో నింపేస్తారు అభిమానులు. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సామ్. మొదటి సినిమాకే మంచి టాక్ రావడంతో ఈ అమ్మడికి దర్శక, నిర్మాతలు వరుసగా ఛాన్సులు ఇచ్చారు. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. ఈ క్రమంలోనే అక్కినేని హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడింది.
కొన్నాళ్లు ప్రేమలో ఉన్న సమంత-నాగచైతన్య పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. కానీ వారి బంధం శాశ్వతంగా నిలవలేకపోయింది. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు. దీంతో ఈ జంట అభిమానులంతా నిరాశకు గురయ్యారు. విడిపోవద్దని సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేశారు. కొందరు సామ్‌కు మద్దతుగా మాట్లాడగా.. మరికొందరు చైతన్యకు మద్దతుగా మాట్లాడారు. తప్పు ఎవరిదో తెలియనప్పటికీ, ప్రస్తుతం ఎవరి జీవితంలో వారు బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం సామ్ ఒంటరిగా ఉంది. ఇటీవలే నాగ చైతన్య.. హీరోయిన్ శోభితతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నట్లు నెట్టింట వినిపిస్తోంది. వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. మయోసైటిస్ కారణంగా సామ్ సినిమాలకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాధి నుంచి కోలుకున్న సామ్ వెబ్ సిరీస్ లు, సినిమాలు, హెల్త్ పాడ్ కాస్ట్ లు చేస్తూ మళ్లీ సినిమాలపై దృష్టి సారిస్తోంది.
ఇటీవల, సమంత సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి, తాను రోజూ చేసే పనుల గురించి మాట్లాడింది.’మార్నింగ్ 6.30 గంటలకు కొంచెం సేపు సూర్యరష్మీ కోసం బయట నిల్చుంటుంది. తర్వాత ఆయిల్ పుల్లింగ్, హెయిర్ మసాజ్ చేయించుకుంటుంది. 7 గంటలకు వర్కౌట్స్ చేస్తుంది. అనంతరం దేవుడకి పూజ చేసి.. వర్క్ కోసం బయటకెళ్లినప్పుడు కారులో కూర్చుని కంటి రక్షణ కోసం కళ్లపై ఏదో పరికరం పెట్టుకుంటుంది. 9 గంటలకు షూట్ లేదంటే ఇతర పనులు చేయడం. సాయంత్రం 6 గంటలకు రెడ్ లైట్ థెరపీ తీసుకుంటారు. రాత్రి 7 గంటలకు పికిల్‌బాల్ ఆడి.. 9.30కి ధ్యానం చేస్తుంది. ఎట్టకేలకు రాత్రి 10 గంటలకు నిద్రకు ఉపక్రమించినట్లు సామ్ వీడియోలో వెల్లడించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇంత చేస్తుంది కాబట్టే సామ్ అంత ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తోంది. సామ్ అందం వెనుక రహస్యం ఇదేనా? సామ్ టైమ్ టేబుల్ పాటిస్తే ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram