Mother Dog :
జీవి ఏదైనా తల్లి తల్లే.. తన పిల్లలను కాపాడుకునేందుకు చివరికి మృత్యువుతో కూడా పోరాడుతుంది. అంత శక్తి, అంత ప్రేమ ఉన్నతి ఒక్క తల్లికి మాత్రమే. చిన్న చిన్న జీవుల నుంచి పెద్ద పెద్ద డైనోసారస్ వరకు ఏవైనా సరే తమ పిల్లలను ప్రేమగా చూసుకుంటాయి. వాటికి కావాల్సిన తిండి నుంచి వాటిని మిగతా జీవులు, శత్రు జీవుల నుంచి రక్షించేందుకు తామే ముందుంటాయి. ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ గా మారింది. తమ పిల్లను కాపాడుకునేందుకు ఒక మూగ జీవి తన యజమాని వైపు ధీనంగా చూడడం ఆకర్షించింది.
విశ్వాసానికి మారుపేరంటే అది కుక్క మాత్రమే. విశ్వాసం చూపడంలో ఏ జంతువు దీనికి సాటిరాదు. అందుకే కుక్కను చాలా ఎక్కువ మంది పెంచుకుంటారు. కుక్కలు పిల్లగా ఉన్నప్పటి నుంచి పెద్దగా మారి వాటికి పిల్లలు పుట్టినా యజమానిని విడిచిపెట్టి వెళ్లవు. ఒక్కో సందర్భంలో యజమాని విదేశాలకు వెళ్తే.. ఆయన కోసం ఏళ్ల తరబడి ఏయిర్ పోర్టు పరిసరాల్లో తిరుగుతూ కాలం గడుపుతాయి. ఇంత గొప్పవి కాబట్టే మనిషితో పాటు మనుగడ సాగిస్తున్నాయి.
ఇక్కడ ఒక చిన్న కుక్కపిల్ల యజమాని విద్యుత్ పరికరాన్ని కొరికి వేసింది. దీంతో యజమాని కోపంతో పిల్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తల్లి వద్దకు వెళ్లిన కుక్కపిల్ల తల్లి సమీపంలో ఒదిగిపోయింది. యజమాని ఒక చెప్పుతో కొట్టాలని చూడగా తల్లి కుక్క వారించింది. చెప్పును పక్కను నెట్టింది. పిల్లను మరింత దగ్గరికి తీసుకుంది. ఇది చూసిన నెటిజన్లు మురిసిపోతూ లవ్ సింబల్ పోస్ట్ చేస్తున్నారు.
https://twitter.com/TansuYegen/status/1683111271418265600?s=20