ఇందులో శోభన, జగ్గయ్య, చంద్రమోహన్ కీలక పాత్ర పోషించారు. ఉరి శిక్ష పడిన ఖైదీ మోహన్ బాబు డబ్బుల కోసం శోభన భర్తగా నటిస్తాడు. జగ్గయ్య కూతురు శోభన మోహన్ బాబును తన భర్తగా పరిచయం చేస్తుంది. అలా జగ్గయ్యకు అల్లుడిగా పరిచయవుతాడు. క్లైమాక్స్ లో హీరోకు ఉరి శిక్ష పడితే తెలుగు ప్రేక్షకుడి అంగీకరించరని, ఇక తన విషయంలో అసలు జీర్ణించుకోలేరని చిరంజీవి దర్శకేంద్రుడితో చెప్పాడు. చిరంజీవి అభిప్రాయాన్ని దర్శకేంద్రుడు ఏకీభవించాడు. అల్లుడు గారు సినిమా విజయం మోహన్ బాబు కు డబుల్ హ్యాట్రిక్ లకు దారి వేసింది. రౌడీ గారి పెళ్లాం, అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ, అల్లరి మొగుడు తదితర సినిమాలు బ్లాక్ బస్లర్లుగా నిలిచాయి. వరుస హిట్లతో మోహన్ బాబు కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు.
Breaking News
Mohan Babu : చిరంజీవి చేసిన పనికి మోహన్ బాబుకు డబుల్ హ్యాట్రిక్స్
Date:
Mohan Babu : మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భిన్న ధ్రువాలు. కెరీర్ ప్రారంభంలో వీరిద్దరూ నెగెటివ్ రోల్స్ చేసి తమను తాము నిరూపించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ పూర్తిస్థాయిలో మాస్ హీరోలుగా తెలుగు తెర మీద ఓ వెలుగు వెలిగారు.చిరంజీవి ఇప్పటికీ తన స్టార్ డమ్ ను కొనసాగిస్తున్నాడు. కానీ మోహన్ బాబు మాత్రం హిట్లు లేక సినిమాలు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. కొన్నేళ్లుగా మోహన్ బాబుకే కాదు అతని కుమారులకు కూడా హిట్లు లేవు. మంచు కుటంబం తీస్తున్న ప్రతి సినిమా ట్రోల్ అవుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు మధ్య ఫైట్ టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుంది. కానీ సినిమాల విషయానికి వస్తే మాత్రం వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంటుంంది.
దాదాపు 35 ఏళ్ల క్రితం చిరంజీవి చేసిన పనికి మోహన్ బాబుకు వరుస సక్సెస్ లు వచ్చాయి. మలయాళం సూపర్ హిట్టయిన ఓ సినిమాను చిరంజీవి హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్లాన్ చేశారు. సినిమా కథ చిరంజీవికి బాగా నచ్చింది. మాస్ హీరోగా టాలీవుడ్ లో నంబర్ వన్ స్థానంలో ఉన్న చిరంజీవి ఆ కథ క్లైమాక్స్ విషయంలో సందేహం వ్యక్తం చేశాడు. క్లైమాక్స్ మారిస్తే కథ దెబ్బతింటుంది. అదే క్లైమాక్స్ నేనుంటే అభిమానులు జీర్ణించుకోరని చిరంజీవి దర్శకేంద్రుడికి వివరించాడు. చిరంజీవి చెప్పిన విషయాన్ని పాజిటివ్ గా తీసుకున్న రాఘవేంద్రరావు ఇదే కథను మోహన్ బాబు కు చెప్పాడు. వెంటనే మోహన్ బాబు ఒకే చెప్పడం, తన సొంత బ్యానర్ లో నిర్మించాడు. ఆ సినిమానే అల్లుడుగారు. ఫలితం సూపర్ హిట్.