leopard : ‘అసలే కోతి ఆపై కల్లు తాగింది’ జనాల నోళ్లలో ఎప్పుడూ నానుతూ ఉండే ఈ సామెత గుర్తుందా..? కోతి కల్లు తాగితే మరింత చిందులేస్తుంది. కానీ క్రూర జంతువులు కల్లుతాగితే ఏం చేస్తాయి. మద్యం ఎంత ప్రమాదమో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. క్రూర జంతువును సైతం పెంపుడు జంతువుకుంటే కూడా పిరికిగా మార్చింది. గ్రామంలోకి వచ్చిన చిరుత పులి మద్యం తాగిందట. ఆ తర్వాత గ్రామస్తులు దాన్ని అడవిలోకి పంపించేందుకు వెనుక నుంచి తరుముతుండగా.. మెల్లిగా నడుస్తూ వెళ్లింది. గ్రామస్తులు జట్టు పీకుతున్నా.. హేళన చేస్తున్నా.. వెంట పడి తరుముతున్నా స్పందించడం లేదు. మధ్యప్రదేశ్‌లోని ఇక్లెలా గ్రామంలో గ్రామంలో చిరుతపులిని చుట్టుముట్టిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. మద్యం తాగి మత్తులో ఉందంటూ వీడియో షేర్ చేశారు. అయితే, ఇది నిజం కాదని అధికారులు చెప్తున్నారు. చిరుత మద్యం లాంటివి తాగదని, అది అనారోగ్యానికి గురైందని తెలుస్తుంది. మెల్లగా నడుస్తోంది, ఈ వీడియో ట్విటర్‌లో IANS ద్వారా పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా ఇక్లెలా గ్రామంలో తీసిన వీడియో అని ఐఏఎన్‌ఎస్ పోస్ట్ పేర్కొంది. చిరుతను అటవీ అధికారులు రక్షించినట్లు ఇండియా టీవీ ఫ్యాక్ట్ చెక్ గుర్తించింది. చిరుత చికిత్స కోసం భోపాల్‌లోని జూకు తరలించారు.