
చాణక్యడు దుర్మార్గుడైన వ్యక్తి గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. మనిషిలో మూఢత్వం పెరుగుతోంది. మనిషిలో స్వార్థపరుడైన వ్యక్తి లక్షణాల గురించి చాణక్యుడు వివరించాడు. మనిషిలో పెరుగుతున్న స్వార్థంతో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. తాను చేస్తున్నది తప్పని తెలిసినా తప్పుకోవడం లేదు. తాను చెప్పిందే వేదం చేసిందే మంచి అనే ధోరణికి వెళ్లిపోతున్నాడు. మూర్ఖుడి తీరు గురించి చాణక్యుడు పలు విషయాలు చెప్పాడు.
మూర్ఖుడి లక్షణాల్లో దురభిమానం ప్రధానమైనది. అందరికి ఉండేది అభిమానం. కానీ చెడ్డవాడికి ఉండేది దురభిమానం. దీంతో ఏం చేస్తున్నాడో అతడికే తెలియదు. ఈ నేపథ్యంలో మూర్ఖుడు ఎవరు చెప్పినా పట్టించుకోడు. తాను అనుకున్నది చేయడానికి ఇష్టపడతాడు. ఎదుటి వారికి నష్టం జరిగినా లెక్కచేయడు. తన లక్ష్యం చేరాలని చూస్తాడు. కానీ అది సరైంది కాదు.
మూర్ఖుడి మాటల్లో కఠినతనం ఉంటుంది. మంచి మార్గంలో మాట్లాడటం అతడికి కుదరదు. తన మాటల్లో కరుకుదనం కనిపిస్తుంది. కానీ కనికరం మాత్రం మచ్చుకైనా కనిపించదు. ఈ క్రమంలో మూర్ఖుడితో స్నేహం చేస్తే మనకు తిప్పలే వస్తాయి. అందుకే అలాంటి వారితో కలిసి ఉండటం దుర్లభం. మంచి వారితో స్నేహం చేస్తే మంచి లక్షణాలు వస్తాయి. చెడ్డ వారితో ఉంటే చెడ్డ లక్షణాలు అలవడతాయి.
మూర్ఖుడు ఎవరి మాట వినడు. చెప్పింది చేయడు. దీంతో చాణక్యుడి మాటలు అక్షరాలా సత్యంగా నిలుస్తున్నాయి. మూర్ఖుడు ఎప్పుడు కూడా స్వార్థంతోనే ఆలోచిస్తాడు. ఎప్పుడు కూడా పది మంది బాగు కోసం శ్రద్ధ తీసుకోడు. దీంతో చెడ్డ వారితో కలిసి ఉండటం వల్ల మనకు కూడా అలాంటి అలవాట్లే వస్తాయి. దీంతో మనం సాధ్యమైనంత వరకు మంచివారితోనే ఉండాలి.






