Huge Box Visakhapatnam Beach : విశాఖపట్నం బీచ్ కు ఓ పెద్ద పెట్టె కొట్టుకు వచ్చింది. దీంతో దాన్ని చూసి అందరు ఆశ్చర్యపోయారు. అదెక్కడి నుంచి వచ్చింది అని ఆరా తీశారు. అది దాదాపు బ్రిటిష్ కాలం నాటిదని తేల్చారు. అందులో ఏముందో తెలుసుకోవాలని ఉత్కంఠ వ్యక్తం చేశారు. దాని బరువు సుమారు వంద టన్నుల వరకు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో పెట్టె గురించి తెలియడంతో జనం తండోపతండాలుగా తరలి వచ్చారు.
పొక్లెయిన్ తో దాన్ని ఒడ్డుకు చేర్చారు. అది అత్యంత పురాతనమైనదిగా చెబుతున్నారు. జనం పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు వారిని కట్టడి చేయడానికి శ్రమించాల్సి వచ్చింది. దీంతో పురావస్తు శాఖ వారికి సమాచారం అందించారు. అనంతరం అందులో ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నించారు. కానీ ఎంతకు తెరుచుకోకపోవడంతో పొక్లెయిన్లను తీసుకొచ్చారు.
ఆపెట్టెను పగులగొట్టడంతో అందులో 50 కర్ర స్లీపర్ లు (దూలాలు) కనిపించాయి. వీటిని పెద్ద షిప్పుల్లో లంగర్ కోసం వాడతారని జాలర్లు పేర్కొంటున్నారు. దీంతో ఉత్కంఠకు తెర పడినట్లు అయింది. ఈ నేపథ్యంలో పెట్టెను చూడటానికి జనం ఎగబడ్డారు. అందులో ఏముందో బంగారం, వజ్రాలు ఉన్నాయోమోనని అందరు ఆశగా ఎదురు చూశారు.
చివరకు అందులో కర్రలు కనిపించడంతో ఉసూరుమన్నారు. ఎంతో ఆశించి అందరు గుమిగూడారు. అవి తెరుచుకునేంత వరకు అందరి గుండెల్లో వేగం పెరిగింది. ఏం బయట పడుతుందోనని కంగారు పడ్డారు. కానీ వారి ఆశలు అడియాశలే అయ్యాయి. కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట పాడినట్లు ఎంతో ఊహించుకుంటే అందులో ఏమి లేదని తేలడం జీర్ణించుకోలేకపోయారు.