
Japanese robot : టెక్నాలజీని జపనీస్ వినియోగించినంత బహూషా ఎవరూ వినియోగించరేమో..! జీ 7 సమావేశాలు జపాన్ లోని హీరోషిమాలో ప్రతిష్ఠాత్మకంగా కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. ఇండియా నుంచి వస్తున్న వారిని ఆహ్వానించేందుకు జపాన్ ఒక రోబోను ఏర్పాటు చేయడం అంతటా చర్చనీయాంశమైంది. ఇక్కడ హ్యుమనాయిడ్ రోబోలను ఎక్కువ తయారు చేస్తున్నారు.
ఇండియన్స్ జపాన్ కు వచ్చి ఇక్కడి సంస్కృతి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు అంటూ రోబోట్ తెలిపింది. ఈ సమ్మిట్ లో అణ్వాయుధాల నిర్వీర్యం చేయడం లక్ష్యంగా కనసాగుతుంది. జపాన్ లోని హీరోషీమా, నాగసాకిపై గతంలో అమెరికా రెండు అనుబాంబులతో దాడి చేసి దేశాన్ని తీవ్ర వినాశనంలోకి నెట్టింది.
‘బహుళ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కలిసి పనిచేయడం’ అంశంపై G7 సెషన్‌లో, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఆహారం, ఆరోగ్యం, అభివృద్ధికి కలుగుతున్న ఆటంకాను పరిష్కరించేందుకు10 పాయింట్ల కాల్‌ను పీఎం మోడీ జాబితా చేశారు.
మోడీ పాయింట్లు..
సన్నకారు రైతులతో సహా అత్యంత దుర్లభమైన వారిని రక్షించేందుకు సమ్మిళిత ఆహార వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నారు. రెండోది మిల్లెట్లను పెంచడం వల్ల ఆరోగ్యంతో పాటు పకృతి బాగుపడుతుందన్నారు. మూడు: ఆహార భద్రతను బలోపేతం చేయాలంటే వృథాను తగ్గించాలన్నారు. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. నాలుగు: ఎరువుల పంపిణీలో ఎలాంటి రాజకీయాలు ఉండవద్దు. ఐదు: ఎరువులకు ప్రత్యామ్నాయ నమూనా అభివృద్ధి చేయాలి, ఆరు: స్థితిస్థాపకమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నించాలి. డిజిటల్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించాలి. అభివృద్ధి దేశాలు అభివృద్ధి నమూనా, ఇలా చాలా అంశాలను వివరించారు నరేంద్ర మోడీ.
ఈ జీ7 సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, ఆయన భార్య జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌లతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.
#WATCH | “Namaste to India,” Robots deployed at the International Media Centre during the G7 summit in Hiroshima, Japan. pic.twitter.com/qmxsyF69Nc
— ANI (@ANI) May 20, 2023