25.2 C
India
Tuesday, January 20, 2026
More

    Rains : ముంచుకొస్తున్న ముప్పు.. అల్పపీడనంతో ఆ జిల్లాల్లో వర్షాలు

    Date:

    Rains
    Rains

    Rains Alerts : ఏపీకి భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు ,నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో రైతులు ఆందోళనతో గడుపుతున్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి.

    గత నెల చివరిలో ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఈదురు గాలులు వీచాయి. వేలాది ఎకరాల్లో వరి నేలకొరిగింది. అయితే మధ్యలో మరో అల్పపీడనం భయం గొలిపింది. అది మరువక ముందే ఇప్పుడు తాజా ఆల్పపీడనం మరింత ఆందోళనకు గురిచేస్తుంది.

    రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే వర్షాల నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని సంరక్షించుకునే పనిలో పడ్డారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంకోవైపు కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం నిబంధనలు రైతులకు ఇబ్బంది పెడుతున్నాయి. రకరకాల కొర్రీలు పెడుతుండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో నిబంధనలు సరళతరం చేయాలని కోరుతున్నారు.

    మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. విశాఖ మన్య ప్రాంతంలో ఉదయం 9 గంటల వరకు పొగ మంచు పడుతూనే ఉంది. ఉదయం 10 గంటల తరువాతే గిరిజనులు బయటకు రావాల్సి వస్తోంది. చాలా ప్రాంతాల్లో ఉదయం వరకు పొగ మంచు పడుతుండడంతో రోడ్డుపై రాకపోకలు సైతం నిలిచిపోతున్నాయి. వాహనదారులు అసౌకర్యానికి గురికాక తప్పడం లేదు. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప రాత్రి సమయాల్లో బయటకు రావద్దని చెప్పుకొస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Monsoon : ఏపీలోకి రుతుపవనాల ఎంట్రీ – నాలుగు రోజుల వానలు

    Monsoon in AP : ఏపీలో చల్లటి వాతావరణానికి బాట పడుతోంది. నైరుతి...

    Heavy Rains : ఏపీకి వానగండం.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు

    Heavy Rains : ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ...

    Rains in Telugu states : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులు వర్షాలు

    Rains in Telugu states : నైరుతి బంగాళాఖాతంలో గురువారం సాయంత్రం...

    Rains in Telangana : తెలంగాణలో వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక

    Rains in Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు...