29.1 C
India
Thursday, September 19, 2024
More

    Miracle : వైద్య చరిత్రలో అద్భుతం..5 వేల కిలోమీటర్ల దూరం నుంచి సర్జరీ చేసిన వైద్యుడు

    Date:

    Miracle
    Miracle

    Miracle : నేటి ఆధునాతన రంగంలో ఏదైనా సాధ్యమే. టెక్నాలజీ యుగంలో మనిషి సాధించలేనిది లేదు. అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తున్నారు. అయితే టెక్నాలజీతో మంచి కన్నా చెడే ఎక్కువగా ఉంటుందని ఆందోళన పడుతుంటారు కొందరు సంప్రదాయవాదులు. అది కరెక్టే కానీ మనం దేని కోసం టెక్నాలజీని ఉపయోగిస్తున్నామన్నది ముఖ్యం. ఒక మంచి పని కోసం టెక్నాలజీ వాడితే అంతకుమించిన ప్రయోజనం ఏముంటుంది. తాజాగా ఓ వీడియో అందరినీ ఆలోచింపజేస్తోంది. టెక్నాలజీతో ఇంత సౌలభ్యం ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. ఆ విషయం ఏంటో చదవండి మరి..

    అది కిర్గిస్థాన్ సరిహద్దుకు చేరువగా ఉండే చైనా నగరం కష్గర్. అక్కడి ఆపరేషన్ థియేటర్లో సర్జరీ కోసం ఓ పేషెంట్‌కు సిద్ధంగా ఉంచారు. అయితే డాక్టర్ మాత్రం అక్కడికి 5 వేల కిలోమీటర్లకుపైగా దూరం ఉండే షాంఘైలో ఉన్నాడు. అక్కడి తన ఛాంబర్‌లో నుంచి బయటకు అడుగుపెట్టకుండానే ఆ డాక్టర్.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పేషెంట్‌కు లంగ్స్ సర్జరీ చేసి ట్యూమర్‌ను తొలగించాడు. జూన్‌లోనే ఈ సర్జరీ జరిగిందని తెలుస్తుండగా.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    చైనాకు ఓ మూలన ఉండే షాంఘై నగరానికి చెందిన డాక్టర్.. దేశానికి మరో మూలన ఉన్న కష్గర్ నగరంలో ఉన్న పేషెంట్‌కు ఆపరేషన్ చేయడం ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారా..? రిమోట్ విధానంలో రోబో సాయంతో ఇది సాధ్యమైంది. ఈ సర్జరీ గురించి ఓ ప్రభుత్వ పోర్టల్ ప్రజలకు సమాచారం ఇచ్చింది. రోబో సాయంతో సర్జరీ చేసే తొలి హాస్పిటల్ షాంఘై చెస్ట్ హాస్పిటల్‌ అని.. డాక్టర్ లువో ఖింగ్‌ఖాన్ మంచి సక్సెస్ రేట్‌తో రిమోట్ సర్జరీలు చేపడుతున్నారని ఆ వెబ్‌సైట్ వెల్లడించింది.

    సమగ్రమైన క్లీనికల్ రీసెర్చ్ వివరాలు, దేశీయంగా రూపొందించిన సర్జికల్ రోబోల సాయంతో ఈ రిమోట్ సర్జరీ చేపట్టినట్లు షాంఘై మున్సిపాలిటీలోని ఇన్ఫర్మేషన్ ఆఫీస్ తెలిపింది. ఈ సర్జరీల కోసం లువో టీమ్ పూర్తిస్థాయిలో సన్నద్ధమైందని వివరించింది. ఈ తరహా తొలి ఇంట్రాసిటీ రిమోట్ రోబోటిక్ సర్జరీని మార్చి నెలలోనే ఓ జంతువుపై చేపట్టి ఈ విధానం సురక్షితమైందని నిర్ధారించుకుందని తెలిపింది.

    ప్రస్తుతం రోబొటిక్ సర్జరీ విధానం విజయవంతంగా వాడుకలోకి వచ్చింది. ఇక నుంచి వేరే ప్రాంతాల నుంచి డాక్టర్లు ప్రయాస పడి రాకుండానే.. ఈ కొత్త విధానంతో సర్జరీలను సక్సెస్ ఫుల్ గా చేసేయొచ్చు. దీంతో సమయ భారం తగ్గడమే కాకుండా రోగికి వీలైనంత తొందరగా వైద్యం అందించిన వారమవుతాం.

    దీంతో సమయ భారం తగ్గడమే కాకుండా రోగికి వీలైనంత తొందరగా వైద్యం అందించిన వారమవుతాం.

    దీంతో సమయ భారం తగ్గడమే కాకుండా రోగికి వీలైనంత తొందరగా వైద్యం అందించిన వారమవుతాం.

    A surgeon in China successfully removed a lung tumor from a patient while being 5000 km away. The doctor operated the machine remotely from his office in Shanghai, while the patient was in Kashgar, located on the opposite side of the country. The entire operation was completed in… pic.twitter.com/8VQrpnvtS0

    — Naresh Nambisan | നരേഷ് (@nareshbahrain) August 2, 2024

    Share post:

    More like this
    Related

    Minister lifestyle : కారు కోసం ప్రభుత్వం నుంచి లోను తీసుకున్న మంత్రి.. ఆ మంత్రి లైఫ్ స్టయిల్ వేరు..!

    Minister lifestyle : ఒకప్పుడు గొప్ప ప్రజా ప్రతినిధులు ఉండేవారు. టంగుటూరి...

    Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ.. కొనసాగుతున్న పడవల వెలికితీత పనులు

    Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద తొమ్మిదో రోజు పడవల...

    Corona Virus : మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. 27 దేశాల్లో గుర్తింపు

    Corona virus : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది....

    Rain disaster : యూపీలో వర్ష బీభత్సం.. ఆగ్రా వీధుల్లో పడవలతో ప్రయాణం

    Rain disaster in UP : ఉత్తర ప్రదేశ్ లో గత...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Miracle In Medicine : వేరుపడిన తల.. అతికించిన వైద్యులు.. వైద్య రంగంలో ఒక మిరాకిల్

    Miracle In Medicine : ఎప్పటికప్పుడు వైద్య రంగం మారుతూనే ఉంది. శాస్త్ర...