
భారత్ లో చైనా కరోనా కొత్త వేరియంట్ ఎంటరైంది. కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో తాజాగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. జీరో కోవిడ్ లక్ష్యంతో పలు ఆంక్షలను విధించింది చైనా. అయితే ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆంక్షలను సడలించింది. దాంతో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు.
ఇక చైనాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ పేరు ఒమిక్రాన్ ” BF 7 ” గా తేల్చారు. ఇది ఒమిక్రాన్ BF. 5 కి ఉప రకమని గుర్తించారు. ఇదే వేరియంట్ ఇండియాలో కూడా ఎంటరైంది. ఈ వేరియంట్ ను గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్ లోనే గుర్తించింది. దేశ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియెంట్ కేసులు మూడు నమోదు అయ్యాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఒడిశాలో ఒక కేసు నమోదు కాగా గుజరాత్ లోని వడోదర లో రెండు కేసులు నమోదయ్యాయి.
కరోనా మరోసారి విలయాన్ని సృష్టిస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. అన్ని విమానాశ్రయాలలో కరోనా స్క్రీనింగ్ టెస్ట్ లను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది.