26.5 C
India
Tuesday, October 8, 2024
More

    Drink Benefits : రోజుకో పెగ్ మంచిదే.. తాగితే ఎన్ని లాభాలో తెలుసా ?

    Date:

    Drink Benefits
    Drink Benefits

    Drink Benefits : మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆల్కహాల్ వల్ల మనిషి ఆరోగ్యానికి హాని కలుగుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ కొంత మంది మాత్రం పెగ్గుల మీద పెగ్గులు లాగిస్తుంటారు. కానీ ప్రస్తుత కాలంలో  ఆల్కహాల్ తీసుకోవడం కామన్ అయిపోయింది. ఆఫీసు పార్టీల్లోనూ మందు సేవించడం అలవాటుగా వస్తోంది.

    ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న వర్క్ కల్చర్, ఇతర దేశాల ప్రభావం వల్ల భారత్ లోనూ మద్యం వినియోగం పెరుగుతోంది. సోషల్ డ్రింక్ పేరుతో కొందరు మద్యాన్ని స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. మరి కొందరు రోజుకి ఒక్క పెగ్ తాగడం ఆరోగ్యానికి మంచిదే అని అంటున్నారు. అయితే నిజంగానే రోజూ ఒక పెగ్ తీసుకోవడం ఆరోగ్యకరమా ? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది? తెలుసుకుందాం.

    ఒక వ్యక్తి రోజుకు ఎంత ఆల్కహాల్‌ తీసుకోవచ్చన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఓ నివేదికను విడుదల చేసింది. ఈ సంస్థ ప్రకారం రోజుకు ఒక పెగ్‌ కూడా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని తేల్చి చెప్పింది. అసలు మద్యం సేవించడం ఆరోగ్యానికి ఏ విధంగానూ మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒక పెగ్ ఏం కాదన్న దాంట్లో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని నివేదికలో పరిశోధకులు తెలిపారు.

    ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మద్యం సేవించడం వల్ల క్యాన్సర్, లివర్ ఫెయిల్యూర్ వంటి సమస్యల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులకు మద్యపానమే కారణమని కూడా ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్ అనేది ఒక రకమైన విషపూరితమైన పదార్ధం. ఇది శరీరానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది.  ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ కొన్ని సంవత్సరాల క్రితం గ్రూప్ 1 కార్సినోజెన్‌లో ఆల్కహాల్‌ను జోడించింది. ఆస్బెస్టాస్, రేడియేషన్, పొగాకు కూడా ఈ ప్రమాదకరమైన సమూహంలో చేర్చబడ్డాయి. ఈ నివేదిక ప్రకారం ఆల్కహాల్ గుండె జబ్బులు,  టైప్ 2 డయాబెటిస్‌కు మంచిదని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవని డాక్టర్లు చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    prison : దసరా వరకు జైళ్లలో ఇష్టా భోజనం.. ఎందుకు పెడుతున్నారంటే?

    prison : జగత్తుకు అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణ. అలాంటి అమ్మ...

    Robots : మనుషులొద్దు.. రోబోలే ముద్దు.. వాటితో శృంగారానికి ప్రాధాన్యత

    Robots : శృంగారం విషయంలో మహిళల ఆలోచనలో మార్పు రానుందా? శృంగారం...

    Monkey : హృదయవిదారకం.. తల్లి చనిపోయిందని తెలియక తన పై పడి లేపుతున్న కోతి

    Mother Monkey Died : ఈ సృష్టిలో అమ్మ ప్రేమ మించింది...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Fasting one day : వారంలో ఒక రోజు ఉపవాసం చేస్తే బోలెడు రోగాలు మాయం

    Fasting one day : పండుగలు లేదా ఏదైనా ప్రత్యేక రోజులలో...

    Baby : మూడ్రోజుల క్రితం పుట్టిన బిడ్డలోపల మరో పిండం..  షాక్ అయిన డాక్టర్లు

    Fetus inside the baby : మధ్యప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన...

    Fungal infection : పెరుగుతున్న ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ సంక్షోభం.. ఆందోళన వ్యక్తం చేస్తున్న శాస్త్రవేత్తలు  

    Fungal infection : ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌లు అభివృద్ధి చెంది భయాందోళన కలిగిస్తున్నాయి....

    Mental agony: మనో వేదన నుంచి బయటపడాలంటే ఏం చేయాలో తెలుసా ..!

    Mental agony : ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలతోనే బాయ్‌ఫ్రెండ్‌తో...