Thrilling OTT Movies : డిఫరెంట్, డిఫరెంట్ కంటెంట్ ను ఓటీటీ వారం వారం ప్రజెంట్ చేస్తూనే ఉంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు, అడ్వెంచర్లను రిలీజ్ చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక పీరియాడికల్ థ్రిల్లర్ మన ముందుకు సైలెంట్ గా ఎంటరైంది. రెజీనా క్యాసెండ్రా నటిగా బాగా రాణించింది. థ్రిల్లర్ స్టోరీలు ఆమెకు బాగా సూట్ అవుతాయి. గతంలో ‘7’ చేసిన ఆమె రీసెంట్ గా ఒక సినిమా చేసింది. కానీ అది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చింది. ఇది శుక్రవారం (సెప్టెంబర్ 22) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఆ సినిమా గురించి తెలుసుకుందాం.
స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు కలిసి నటించిన తార రెజీనా క్యాసెండ్రా. మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి. గతేడాది చిరంజీవితో ఐటెం సాంగ్ లో నటించింది. ఆచార్య సినిమాలో ‘సానా కష్టం వచ్చింది’ అంటూ మెగాస్టార్ తో కలిసి స్టెప్పులు వేసింది. దీని తర్వాత నివేదా థామస్ తో కలిసి ‘శాకిని డాకిని’లో నటించింది. ఇది పర్వాలేదనిపించింది.
ఈ సినిమా తర్వాత ఆమెకు చాలా గ్యాప్ వచ్చింది. ‘నేనే నా..?!’లో నటించింది. ఈ సినిమాను డైరెక్టర్ కార్తీక్ రాజు తెరకెక్కించాడు. రాజశేఖర వర్మ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు మేకర్స్. అయితే థియేటర్లలో మూవీకి అంతా టాక్ దక్కలేదు. దీంతో అసలు మూవీ వచ్చిందా? అన్న సందేహం కలిగింది ప్రేక్షకులకు.
ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఆహా’ ప్లాట్ ఫారంలో శుక్రవారం (సెప్టెంబర్ 22) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మిస్టరీ కథతో ఈ మూవీని రూపొందించారు. ఇందులో డ్యూయల్ రోల్ చేసింది రెజీనా. ఫస్ట్ క్యారెక్టర్ ఆర్కియాలజిస్ట్. సెకండ్ క్యారెక్టర్ లో ఆమెను హత్యలు చేసే యువతిగా కనిపిస్తుంది. థియేటర్లలో మెప్పించని సినిమాలు ఓటీటీలో మంచి హిట్ అవుతాయి. ఈ నేపథ్యంలో రెజీనా మూవీకి ఓటీటీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.