Dr. KA Paul : తనపై విష ప్రయోగం జరిగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఎవరో కావాలని నన్ను చంపాలని ఫుడ్ పాయిజన్ చేశారని ఆయన తెలిపారు. గత పది రోజులుగా వైజాగ్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటు న్నానని కేఏ పాల్ తెలిపారు. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఎవరు ఈ ఫుడ్ పాయి జన్ చేశారో పోలీసులు కనిపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
నన్ను చంపాలని చాలా దేశాలు వారు ప్రయత్నిం చిన వారి వల్లే కాలేదన్నారు. ఇక్కడ ఉన్న వాళ్లు నన్ను ఏం చేయలేరని కె ఏ పాల్ అన్నారు. నాపై విష ప్రయోగం చేసే స్థాయికి రాజకీయాలు వెళ్లాయని పాల్ ఆరోపించారు. దేవుడి దయవల్ల తాను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డానని పాల్ తెలిపారు. నాపై ఫుడ్ పాయిజన్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.