
Telugu Desam Party Supporters: తెలుగు దేశం అంటే పేద ప్రజల పార్టీ. బీసీల పార్టీ.. రైతుల పార్టీ. ఎవరు అవునన్నా.. కాదన్న తెలుగు దేశం ఆవిర్భవించిన తొలినాళ్లలో ప్రతి పేదోడు ఈ పసుపు జెండాను ఎత్తాడు. ఇక బీసీల్లో ఎందరికో రాజకీయ అవకాశాలు కల్పించిన ఏకైక, మొదటి పార్టీగా టీడీపీ ప్రస్థానం సాగింది. టీడీపీ ఆవిర్భవించాకే పేదోళ్లకు అండగా నిలిచే పలు సంక్షేమ పథకాలు పుట్టుకొచ్చాయి. తెలుగు జాతి ఉన్నంతవరకు టీడీపీకి స్థానం ఉంటుందని చెబుతున్నారు.
నేటికీ ఎన్నిపార్టీలు పుట్టుకొచ్చినా పేదల పార్టీగా ముద్రపడింది ఒక్క టీడీపీనే. అన్న ఎన్టీఆర్ ప్రారంభించిన పార్టీపై ఇప్పటికీ చాలా మందిలో అభిమానం దాగి ఉంది. ఇక వృద్ధులు నేటికీ తెలుగుదేశం పార్టీనే ఎక్కువ శాతం అభిమానిస్తుంటారు. తాజాగా ఒక రైతు తన పొలంలో దుక్కి దున్నతున్న వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. ఎడ్లతో నాగలి దున్నుతుండగా, నాగలికి టీడీపీ జెండా కట్టి తన అభిమానాన్ని ఆ రైతు చూపుతున్నాడు.
మండు టెండలో ఆ రైతు దుక్కి దున్నుతుండగా, టీడీపీ జెండా రెపరెపడలాడుతున్నది. ఈ వీడియో చూసిన ప్రతి టీడీపీ అభిమాని దీనిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇదిగో గుండెల్లో అభిమానం అంటూ ట్రోల్ చేస్తున్నాడు. కక్ష సాధింపులు, బెదిరింపులు టీడీపీని ఏం చేయలేవని చెబతూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. అభిమానాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ టీడీపీ శ్రేణులు వైసీపీపై అటాక్ చేస్తున్నారు.