- జీ 20 సమ్మిట్ లో ప్రసంగించిన రాంచరణ్

Hero Ramcharan : జమ్మూ కశ్మీర్లో జీ20 సమ్మిట్ మీటింగ్ జరుగుతున్నది. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సు కోసం భారత్ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. చైనా, టర్కీ మినహా సమ్మిట్ లోని మిగతా దేశాలు ఈ సదస్సుకు హాజరయ్యాయి.. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఒక తెలుగు హీరోకి కేంద్రం నుంచి ఆహ్వానం అందింది.
అయితే ఈ సదస్సుకు ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ తరఫున తెలుగు హీరో రామ్ చరణ్ పాల్గొన్నారు ఈ సదస్సుకు ఆయనను ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారు. ఇది తెలుగు ప్రజలందరూ గర్వించాల్సిన విషయమని చాలామంది అభిప్రాయపడ్డారు. ఆయనతో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు స్టెప్పులు వేయించారు.
అయితే కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తరఫున మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఇండియాలో ఉన్న పర్యాటక ప్రాంతాలను నా సినిమాల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. భారతీయ సినిమాలు మంచి కంటెంట్, విలువలతో ఉంటాయని పేర్కొన్నారు. అయితే ప్రకృతి సంపదను, సుందరమైన ప్రదేశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం అంటూ ఆయన ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది ఈ ప్రసంగం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల హృదయాలను మరోసారి గెలుచుకున్నారు. సమ్మిట్ కు వచ్చిన అతిథులు ఆయన ప్రసంగాన్ని హర్షించారు. సమ్మిట్ లో భాగంగా జమ్మూ కశ్మీర్ చేరుకున్న సినీ నటుడు రాంచరణ్ కు ఘన స్వాగతం లభించింది. పలువురు ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు