Union Minister Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. ఐక్య రాజ్య సమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ వేదికగా ప్రసంగించాలని కిషన్ రెడ్డిని యూఎన్ డబ్ల్యూటీఓ న్యూయార్క్ కు ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో భాగంగా కిషన్ రెడ్డి ప్రపంచ పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రసంగించనున్నారు. కాగా ఈ ఆహ్వానం అందుకున్న తొలి భారత పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. జూలై 13, 14 తేదిల్లో న్యూయార్క్ లోని యూఎన్ ఓ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తారు.
కేంద్ర మంత్రికిగా ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జేఎఫ్క్ ఎయిర్ పోర్డులో ప్రవాస భారతీయులు కృష్ణా రెడ్డి ఏనుగుల (మాజీ అఫ్-బీజేపీ-జాతీయ అధ్యక్షులు ), రఘువీర్ రెడ్డి, రామ్ వేముల, విలాస్ రెడ్డి జంబుల (తెలంగాణ అఫ్-బీజేపీ కన్వీనర్ ), వంశీ యంజాల, కృష్ణ మోహన్ ములే, హరి సేతు , దీప్ భట్ తదితర కమ్యూనిటీ లీడర్లు స్వాగతం పలికారు.