
OG Movie Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది నుంచి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో కాస్త నిరాశలో ఉన్న అభిమానులకు ఇప్పుడు పండగే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్లనే సినిమా అప్‌డేట్స్ ఆలస్యమయ్యాయని తెలుస్తోంది.
అయితే, మేకర్స్ వచ్చే నెలలో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ వచ్చే నెలలో సినిమా కోసం సమయం కేటాయించనున్న నేపథ్యంలో, అభిమానులు ఊహించని స్థాయిలో టీజర్‌ను విడుదల చేసి, సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.