
Shanti Vanam : సంకల్పం గొప్పదైతే ప్రకృతి కూడా సహకరిస్తుంది అనేందుకు ఇదే ఉదాహరణ. ఒక్క ఆకుతో మొత్తం అడవి పెరుగుతుంది. రోజు రోజుకూ పచ్చదనం కనుమరుగవుతుండడంతో కాలుష్యం బాగా పెరిగిపోతోంది. జంతుజాతి గ్లోబల్ వార్మింగ్ తో మృత్యు ముఖంలోకి వెళ్తుంది. గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలంటే చెట్లు ఎక్కువ మొత్తంలో పెంచాలి. విత్తనాలతో అది సాధ్యం కాకపోవచ్చు అందుకే శాస్త్రవేత్తలు ఒక పద్దతిని కనుగొన్నారు. ఇది పాత పద్ధతే అయినా సృజనాత్మకతతో తక్కువ కాలంలో ఎక్కువ ఫలితాలను సాధించవచ్చని నిరూపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
విత్తనం నుంచి మహా అయితే ఒక్క వృక్షం మాత్రమే పుడుతుంది. అది ఎప్పుడో ఎక్కడో ఒకటి అది పెరిగి పెద్దయ్యే వరకూ చాలా వృక్షాలు కనుమరుగవుతాయి. ఇదంతా ప్రకృతి పరంగా జరుగుతుంది. ఒక్క ఆకుతో దాదాపు లక్ష మొక్కలను సృష్టించడం అంటే వినేందుకే ఆశ్చర్యంగా ఉంది కాదా.. అవును ఇది అక్షరాల నిజం. ఇది ఎక్కడంటే ‘హార్ట్ ఫుల్ నెస్ ట్రీ కన్సర్వేషన్ సెంటర్’ లో జరుగుతుంది. కన్హ శాంతి వనంలో ఈ ప్రయోగాల ద్వారా మొక్కలను సృష్టిస్తున్నారు. ఆకు నుంచి తీసుకున్న చిన్న టిష్యూ నుంచి మొక్కను ఉత్పత్తి చేసి, ఆ మొక్కను ఒక జార్ లో పెడతారు. దీన్ని జాగ్రత్తగా నిల్వ చేసి మొక్కగా మారిన తర్వత నాటుతారు. ఈ జెనటికల్ గా ఉత్పత్తి చేసే విధానంతో ఎంతో మేలు జరగడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది.
ఈ విధానంతో చాలా రకాల మొక్కలను ఉప్పత్తి చేసి వాటిని, నాటి వృక్షజాతిని కాపాడడంతో పాటు విపరీతంగా పెంచే ఛాన్స్ కూడా ఉంటుంది. కొన్ని రాకాల అరుదైన వృక్ష జాతులను కూడా కొన్ని వందల ఏళ్ల వరకూ జెనటిక్ రూపంలో దాచిపెట్టవచ్చు. ఇక ఒక్క ఆకుతో పూర్తి అడవిని సృష్టించి భూతాపాన్ని తగ్గించంతో పాటు ప్రకృతి సౌందర్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. కన్హా శాంతి వనం చేస్తున్న ఈ కృషికి ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.