AP Jagan ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి కేంద్రం పూర్తిస్థాయిలో సహకరిస్తున్నది. అడిగినదానికంటే ఎక్కువే నిధులను కట్టబెడుతున్నది. పోలవరం, విశాఖ స్టీల్, రైల్వే జోన్, తదితర విషయాలు మినహా అనేక విధాలుగా సహకరిస్త, పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నది. వైసీపీ ప్రభుత్వంతో కేంద్రం స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నదని ఇటీవల విడుదల చేసిన నిధుల లెక్కలను బట్టి తెలుస్తున్నది.
అయితే ఇదే సమయంలో పార్లమెంట్లో మాత్రం వైసీపీ ప్రభుత్వ తీరును ఆయా శాఖల కేంద్ర మంత్రులు ప్రతిసమావేశాల్లోనూ ఎండగడుతూనే ఉన్నారు. తాజాగా కేంద్ర మంత్రి షెకావత్ కూడా దీనిపై మాట్లాడారు. ఏపీ పరిస్థితి చూస్తుంటే, దారుణంగా ఉందని చెప్పుకొచ్చారు. తనకే బాధేస్తున్నదన్నారు. ప్రజలకు శుద్ధజలం అందించేందుకు తెచ్చిన జల జీవన్ మిషన్ కింద ఏపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వినియోగించుకోలేదని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అయితే ఏపీలో ప్రజలకు లేని బాధ, కేంద్ర మంత్రి కి ఎందుకని వైసీపీ శ్రేణులు ఆడిపోసుకుంటున్నాయి. అయితే ఒక్క రూపాయి కూడా వాడుకోలేదంటే, ప్రజలకు తాగునీరు అక్కర్లేదని ప్రభుత్వం అనుకుంటున్నదని రాష్ర్టంలో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
అయితే కేంద్రం ఇచ్చే నిధులను వాడేసుకొనే జగన్ మరి ఇవి ఎందుకు వాడలేదని అందరికీ అనుమానం కలిగింది. తీరా ఆరా తీస్తే ఈ నిధుల విషయంలో నిధులు నొక్కేయడానికి ఇందులో చాన్స్ ఉండదు. రాష్ర్ట ప్రభుత్వం కూడా కొంత మ్యాచింగ్ గ్రాంట్ కు పెట్టాల్సి ఉంటుంది. అయితే మినరల్ వాటర్ కేంద్రాలు బతకాలంటే మరి ఈ శుద్ధజలం ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం.. దండుగ అన్న రీతిలో జగన్ సర్కారు వదిలేసిందని చెబుతున్నారు.దీనిపై ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి.