AP News : మానవ సంబంధాలు రోజురోజుకు మృగ్యం అయిపోతున్నాయి. ఆర్థిక సంబంధాలు రాజ్య మేలుతున్నాయి. నవ మాసాలు కడుపున మోసి కనిపించిన తల్లిని అత్యంత కర్కశంగా కడుపుపై తన్ని దాడి చేశాడు ఓ తనయుడు. కాటికి కాళ్లు చాపుకున్న వయసులో కన్న తండ్రి అని కనికరం కూడా లేకుండా తండ్రిని సైతం చితకబాదాడు ఓ మానవ మృగం. అత్యంత అమానవీయంగా జరిగిన ఈ దాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఆస్తికోసం తల్లిదండ్రులపై ఊరంతా చూస్తుండగా దాడి చేసిన అమానవీయ ఘటన ప్రస్తుతం తరిగి పోతున్న నైతిక విలువలకు అద్దం పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లె నీరు గట్టు వారి పల్లెలో తల్లిదండ్రులపై ఓ తనయుడు కర్కశాన్ని చూపించాడు. వృద్ధులు అని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. తల్లిని జుట్టు పట్టి ఈడ్చాడు. ముఖం పై కాలితో బలంగా తంతూ దాడి చేశాడు.
నొప్పి తట్టుకోలేక తల్లి ఏడుస్తున్నా కనికరించకుం డా దాడి చేశాడు. ఇక తండ్రిని సైతం బూతులు తిడుతూ ఇష్టారాజ్యంగా కొట్టాడు. మదనపల్లె – నీరుగట్టువారిపల్లెలో సోదరుడికి భూమి ఎలా రాశారంటూ తల్లితండ్రుల మీద దాడి చేసిన కొడుకు తనకు ఆస్తి ఇవ్వలేదని వారిని విచక్షణారహితంగా బయటకు ఈడ్చి కొట్టాడు.
ఇక ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇతనిపై చర్యలు తీసుకోవాలని ఏపీ పోలీసులకు చేసిన విజ్ఞప్తి మేరకు ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. కొడుకు చేతిలో దెబ్బలు తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధ దంపతులను మదనపల్లి టూ టౌన్ సీఐ పరామర్శించారు.
ఆ వృద్ధ దంపతులు తమ గోడును పోలీసులకు వెళ్లబోసుకున్నారు. గతంలోనూ నాలుగు సార్లు తమ కుమారుడు తమపై దాడి చేశాడని, పోలీసు లకు ఫిర్యాదు చేసినా తమకు ఎటువంటి న్యా యం జరగలేదని వారు వాపోయారు. తమ కుమారుడిపై చర్య తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు మదనపల్లె టూ టౌన్ సిఐ కి విజ్ఞప్తి చేశారు.
Sensitive content warning
ఆస్తి కోసం తల్లితండ్రుల మీద దారుణంగా దాడి చేసిన కన్న కొడుకు
మదనపల్లె – నీరుగట్టువారిపల్లెలో సోదరుడికి భూమి ఎలా రాశారంటూ తల్లితండ్రుల మీద దాడి చేసిన కొడుకు.@APPOLICE100 దయచేసి ఇతనిపై చర్యలు తీసుకోగలరు. pic.twitter.com/IFqdPg9xlL
— Telugu Scribe (@TeluguScribe) March 3, 2024
బాధితులను పరామర్శించిన మదనపల్లె 2 టౌన్ సీఐ https://t.co/dZv8K7MvMq pic.twitter.com/vqaG7H7xww
— Telugu Scribe (@TeluguScribe) March 3, 2024