24.9 C
India
Friday, March 1, 2024
More

  Amazon Forest : అమెజాన్ అడవుల్లో అత్యాధునిక నగరం? బయటపడ్డ ఆధారాలు ఏం చెప్తున్నాయంటే?

  Date:

  oldest city found in Amazon forest
  oldest city found in Amazon forest

  Amazon Forest : భారీ అడవుల గురించి ప్రస్తావన వస్తే మొదట వినిపించే పేరు ‘అమెజాన్’ అడవులే. ఇక్కడ చాలా రకాల జీవకోటి నివసిస్తుంది. దట్టంగా పచ్చని వృక్ష సంపద ఈ అడవుల సొంతం. అయితే, ఇక్కడ వేలాది సంవత్సరాల క్రితం ఒక నగరం ఉండేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆనవాళ్లు ఇటీవల బయట పడ్డాయి.

  గత చరిత్రను ఈ ఆనవాళ్లు తిరగరాసేలా ఉన్నాయని చరిత్ర కారులు చెప్తున్నారు. అమెజాన్ పరిధిలోని తూర్పు ఈక్వెడార్‌లోని ఉపానో ప్రాంతంలో పురాతన నగరం ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ వేలకొద్ది దీర్ఘ చతురస్రాకారం ఆకారంతో నిర్మాణాలు రోడ్లు, కాలువలతో పెద్ద నగరమే ఉండేదని గుర్తించారు. అగ్నిపర్వతపు నీడలో ఉండే ఈ నగరం అంతరించిపోవడానికి, ఆ అగ్ని పర్వతమే కారణం అయి ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

  అద్భుతం..
  పెరూలోని మచుపిచ్చు లాంటి దక్షిణ అమెరికాలోని ఎత్తయిన నగరాల గురించి విన్నాం. అక్కడి ప్రజలు సమూహాలుగా, చిన్న స్థావరాలను ఏర్పాటు చేసుకొని నివసించేవారని అనుకున్నాం. కానీ, ఆ పురాతన నగరపు ఆనవాళ్లను పరిశీలించాక, అందుకు భిన్నంగా మరో కోణం ఉందని చెప్తున్నారు. ఫ్రాన్స్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్‌లోని రీసెర్చ్ డైరెక్టర్‌గా స్టీఫెన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఈ పరిశోధనను పర్యవేక్షిస్తున్న ప్రొఫెసర్ స్టీఫెన్ రొస్టెయిన్ మాట్లాడుతూ, ‘ఇప్పటి వరకు మేం గుర్తించిన వాటిలో నగరాల్లో ఇదే అతిపురాతనమైనది’ అన్నారు.

  ‘ఇప్పటి వరకు నాగరికతపై యూరప్ కేంద్రీకృత అభిప్రాయం ఉండేది కానీ, ఇది సంస్కృతి, నాగరికతల విషయంలో మన ఆలోచనను మార్చేలా కనిపిస్తుంది.’ అన్నారు. ‘అమెజాన్ సంస్కృతిని మనం చూసే విధానం ఇప్పుడు మారిపోయింది. ప్రజలు చిన్న చిన్న సమూహాలుగా చిన్న గుడిసెలను నిర్మించుకొని, నగ్నంగా (స్పష్టంగా తెలియనప్పటికీ), నేలను చదును చేసుకొని జీవించేవారిని గతంలో అనుకున్నాం. కానీ, ఈ నగరాన్ని చూస్తుంటే క్లిష్టమైన అర్బన్ సొసైటీల్లో జీవించినట్లు తెలుస్తోంది’ అని అధ్యయనపు సహ రచయిత, పరిశోధకులు ఆంటోనీ డోరిసన్ అన్నారు.

  ఆ పురాతన నగరం 2500 ఏళ్ల క్రితం నిర్మించిందై ఉంటుందని, అక్కడ వెయ్యేళ్లకు పైగా జనావాసాలు ఉన్నట్లుగా తెలుస్తోందని ఆర్కియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ఏ సమయంలో ఎంత మంది జనాభా అక్కడ ఉండేవారో కచ్చితంగా అంచనా వేయడం కష్టమని, ఆ సంఖ్య 10వేల నుంచి లక్ష వరకు కావచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

  300 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో లేజర్ సెన్సార్లతో చేపట్టిన సర్వే, పలు చోట్ల తవ్వకాల ఆధారంగా వృక్షాల కింద నగరానికి సంబంధించిన ఆనవాళ్లు అనేకం ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎల్ఐడీఏఆర్ టెక్నాలజీతో చేపట్టిన సర్వేలో 6వేల దీర్ఘచతురస్రాకార నిర్మాణాలు 20 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2-3 మీటర్ల ఎత్తులో నిర్మాణాలు ఉన్నట్లు తేలిందన్నారు.  ఇవి నగరపు మధ్య పాంత్రం చుట్టూ 3 నుంచి 6 యూనిట్ల చొప్పున నిర్మించారని చెప్పారు.

  శాస్త్రవేత్తలు ఆ నిర్మాణాల్లో చాలా వరకు గృహాలే కావచ్చని విశ్వసిస్తున్నారు. కొన్ని ఉత్సవాల కోసం కూడా నిర్మించారని, ఒకటి 130 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఉందని చెప్పారు. ఎత్తయిన కొండ ప్రాంతాలను చదును చేసి, నేలకు కాస్త ఎత్తులో నిర్మించారు. ఆ నిర్మాణాలను అనుసంధానిస్తూ పొడవైన మార్గాలతో రహదారుల వ్యవస్థ కూడా ఉంది. వాటిలో ఒక రోడ్డు మార్గం 25 కిలో మీటర్ల వరకు పొడవు ఉంది. ఆ దారులే ఆశ్చర్యకరమైన అంశమని డా. డోరిసన్ తెలిపారు.

  ‘రహదారుల వ్యవస్థ అధునాతనంగా, చాలా దూరం వరకు, అంతా అనుసంధానమై ఉంది. కొన్నిచోట్ల ఆ మార్గాలు లంబాకృతిలో నిర్మితమై ఉండడం ఆకట్టుకునే విషయం’ అన్నారు. ‘అక్కడి భౌగోళిక స్థితిని దృష్టిలో ఉంచుకొని నిర్మాణాలు చేపట్టడం మామూలు విషయం కాదు’ అని పేర్కొన్నారు. తొలిసారిగా ఆ పురాతన నగరం గురించిన ఆధారాలు 1970 లలో గుర్తించారు.

  కాజ్‌వేలకు ఇరువైపులా గుంటలు ఉండడాన్ని గుర్తించారు. బహుశా అక్కడి ప్రజల తాగునీటి అవసరాలను కోసం వాటిని తవ్వి ఉంటారని భావిస్తున్నారు. ఆ పురాతన నగరానికి పొరుగు ప్రాంతాల నుంచి ముప్పు ఉన్నట్లుగా నగరపు ప్రవేశం, సరిహద్దుల వద్ద తవ్విన కొన్ని గుంతలను పరిశీలిస్తే అర్థం అవుతుందని అన్నారు. అందుకు ఆ గోతులే ఆధారమని నమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో నివిసించింది ఏ నాగరికతకు చెందిన వారో వారి వివరాలేవీ తెలియలేదు. ఆ నిర్మాణాల వద్ద కాల్చిన విత్తనాలు, విసురు రాళ్లు, వంటపాత్రలను గుర్తించినట్లు తెలుస్తోంది.

  మెక్సికో, మధ్య అమెరికాలో నివసించిన మయన్‌లను మించిన సంక్లిష్టమైన రీతిలో ఇక్కడి వారు నివసించినట్లు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిశోధనలో భాగం కానప్పటికీ యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్‌టర్‌లోని ఆర్కియాలజీ ప్రొఫెసర్ జోస్ ఇరియార్టే మాట్లాడుతూ, ‘మయన్‌ నాగరికత తరహాలో మరో నాగరికత ఉనికి ఉందని గుర్తించారని అర్థం చేసుకోవాలి. వారి కన్నా కూడా భిన్నమైన సాగు, సిరామిక్స్‌ నిర్మాణాల నగరంలో వారు జీవించారని ఊహించుకోవాలని’ చెప్పారు.

  సౌత్ ఆఫ్రికాలోని ఆ ప్రాంతంలో అరుదైన అష్ట భుజి, దీర్ఘ చతురస్రాకారాల్లో నిర్మాణాలను గుర్తించిటన్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బహుశా కిలామోపె, ఉపానోలకు చెందిన ప్రజలు కావచ్చని, వారు ప్రధానంగా సాగుపైనే ఆధారపడి జీవించేవారని అంచనా వేస్తున్నారు. వారు మక్క జొన్న, చిలకడదుంపలు తినేవారు. ‘చిచా’ అనే ద్రావణాన్ని మద్యంగా తీసుకునేవారు.  ప్రొఫెసర్ రొస్టైన్ మాట్లాడుతూ, తొలినాళ్లలో అమెజాన్ అడవుల్లో పురాతన ప్రజలెవరూ లేరని అప్పటి శాస్త్రవేత్తలు నమ్మారని, ఈ పరిశోధన వృథా అన్నట్లుగా వారు భావించారన్నారు.

  Share post:

  More like this
  Related

  Increasing VIPs : దేశంలో పెరిగిపోతున్న వీఐపీ, వారి ఖర్చు.. ఇతర దేశాల్లో ఎంతంటే?

  Increasing VIPs : -బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! -ఫ్రాన్స్‌లో...

  Frogs Marriage : కప్పలకు పెళ్లెందుకు చేస్తారో తెలుసా? దీని వెనకున్న కథ ఇదీ..

  Frogs Marriage Behind Story : భారత్ లో ఇప్పటికీ వివిధ...

  Anchor Anasuya : అనసూయ స్టైల్ స్కార్చర్ ఎథ్నిక్ లుక్

  Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం...

  Chanakya Niti : పెళ్లయిన మగవారు ఇతర స్త్రీల పట్ల ఎందుకు ఆకర్షితులవుతారు? చాణక్య చెప్పిన విషయాలు ఏంటి?

  Chanakya Niti : ఆచార్య చాణక్య గొప్ప పండితుడు. తనను అవమానించని...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Special story : పాముల దీవి అదీ.. అక్కడికెళితే తిరిగిరారు.. స్పెషల్ స్టోరీ

  Special story :  పాములంటే అందరికి భయమే. వాటిని చూస్తే పరుగెడతాం....

  విడాకులు వచ్చాయనే ఆనందం.. అంతలోనే విషాదం..

  Bungee jump: సాధారణంగా విడాకులు రావడమంటే వట్టిమాటేం కాదు. ఏళ్లకు ఏళ్లు...