Viral Video : గురుర్ బ్రహ్మ.. గురుర్ విష్ణు.. గరుదేవో మహేశ్వర అంటూ త్రిమూర్తులతో గురువును పోల్చారు మన పెద్దలు కానీ ఎక్కడా కూడా గురు శిష్యుల బంధం భార్య, భర్తలుగా మారుతుందని పురాణాల నుంచి కూడా బహూషా తక్కువ ఆధారాలు ఉండవచ్చేమో. శిష్యులను తీర్చిదిద్దాల్సిన గురువులు వ్యవహరించే తీరుతో ఆ పవిత్ర బంధంకు అర్థం మారుతుంది. ఇక్కడ జరిగిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని గురించి తెలుసుకుందాం.
ట్యూషన్ ఫీజు కట్టలేక ఓ విద్యార్థిని తన టీచర్‌ని పెళ్లి చేసుకుందని పేర్కొంటూ ఈ రోజు (మార్చి 6) సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ప్రజలు వైరల్ వీడియోపై ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఈ వీడియో ఫన్నీ వీడియో కావచ్చని కూడా చెప్తున్నారు.
వైరల్ వీడియోలో ఒక అమ్మాయి పాఠశాల యూనిఫాం ధరించి ఒక వ్యక్తితో పాటు పూలమాల వేసుకొని కనిపిస్తుంది. దీంతో పాటు వివాహం తర్వాత మహిళలు పెట్టుకునే పాపిటలో కుంకుమ కూడా కనిపిస్తుంది. మహిళలు హిందూ వివాహ సంప్రదాయంలో భాగమైన ఆమె నుదుటిపై ‘సింధూర్’ రాసుకుంది.
వీడియో రెండో భాగంలో, ఒక వ్యక్తి స్వయంగా కెమెరా ముందు ఒప్పుకున్నాడు, ‘నేను ఆమె ఉపాధ్యాయుడిని, ఆమె తన ఫీజు మొత్తం ₹10,000 చెల్లించలేకపోయింది, కాబట్టి బదులుగా నన్ను పెళ్లి చేసుకుంది.’ అన్నాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు కామెంట్ సెక్షన్ అంతా ఫన్నీ ఎమోజీలతో నిండి ఉంది. నెటిజన్లు వైరల్ వీడియోను చూసి జైకొడుతున్నారు.
View this post on Instagram