Visionary Leader Chandrababu : తెలుగు రాష్ర్టాల్లో అభివృద్ధికి బాటలు వేసిన నాయకత్వం ఆయనది. దేశవిదేశీ ప్రముఖులను తన వ్యవహారశైలితో మెప్పించి, ఎన్నో ప్రముఖ కార్పొరేట్ సంస్థలను తెలుగు రాష్ర్టాలకు తెచ్చిన ఘనత ఆయనది. ఒకనొక దశలో నార్త్ ఇండియా పెత్తనాన్ని అడ్డుకొని, ఢిల్లీలోని కేంద్ర సర్కారులో కీలకంగా వ్యవరించిన లీడర్ ఆయన. 14 ఏండ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏండ్లు ప్రతిపక్ష నేతగా, రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఓటమిని, గెలుపును ఒకే దశలో తీసుకుంటూ ముందుకు సాగుతున్న విజనరీ లీడర్ ఆయన.. ఆయనే హైదారాబాద్ కు ఐటీ వెలుగులనిచ్చిన చంద్రబాబు.
1998లో గుట్టలుగా ఉన్న ఒక ప్రాంతం నేడు సైబరాబాద్ అయ్యిందంటే.. దాని వెనుక కష్టం చంద్రబాబుది. మాదాపూర్ ప్రాంతం లో హైటెక్ సిటీ వెలుగులు విరజిమ్మాయంటే దానికి కారణం ఆయన దార్శనికత. హైటక్ సిటీ అంటే కాంక్రీట్ కట్టడం కాదు.. అది లక్షల జీవితాల్లో వెలుగు అని నమ్మింది మొదట ఆయనే. హైటెక్ సిటీ, హైటెక్స్, శిల్పారామం, ఐఎస్బీ, ట్రిపుల్ ఐటీ, మైండ్ స్పేస్, శిల్ప కళావేదిక ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పేందుకు వచ్చే ఏకైక వాక్యం.. చంద్రబాబు. శంషాబాద్ ఎయిర్ పోర్టును తొలుత ప్రతిపాదించినప్పుడు నవ్విన వారే ఇప్పుడు ముక్కున వేలేసుకున్నవారు.
కేవలం 9 ఏండ్లలో సైబరాబాద్ నిర్మించిన ఆయన నుంచి అమరావతి లాంటి నగరం పురుడు పోసుకుంది. దానిని ఆదిలోనే చంపే కుటిల ప్రయత్నం నేటి ప్రభుత్వం చేసినా, ఆయన ఆలోచన ఆగదు. మళ్లీ దానిపైనే ఆయన ఆచరణ. 45 ఏండ్ల రాజకీయ జీవితంలో అభివృద్ధి పనులే తప్పా, అవినీతి మరకలు అంటని ఓ పెద్దమనిషిపై నేటి ప్రభుత్వం విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నదని దేశవిదేశాల్లోని తెలుగు జాతి అభిప్రాయపడుతున్నది. ఐయామ్ విత్ సీబీఎన్ అంటూ కదం తొక్కుతున్నది.
తెలుగు రాష్ర్టాల్లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని పేరు ఆయన సొంతం. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నేనే పెట్టాను అంటే నవ్విన మనుషులంతా ఒక్కసారి హైదరాబాద్ గత ముఖ చిత్రాన్ని చూసుకుంటే బాగుండేది. అన్నింటికీ బాబు నేనే అంటారు అని వ్యంగ్యంగా మాట్లాడే రాజకీయ నేతల్లా నేటికీ కొందరు అభిప్రాయంలో ఉన్నారు. మరి ఆయన కాకుంటే తెలుగు రాష్ర్టాల్లో అభివృద్ధిని పరుగులెత్తించిన నాయకుడు ఇప్పటివరకు ఎవరు ఉన్నారని.. అందుకే ఆయనో విజనరీ లీడర్. దటీజ్ చంద్రబాబు.