26.5 C
India
Tuesday, October 8, 2024
More

    Divorce : భర్త స్నానం చేయడం లేదని కోర్టుకెక్కి  విడాకులు కోరిన భార్య

    Date:

    Divorce
    Divorce

    Divorce : భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినప్పుడు విడిపోవడం సహజం. ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగడం సాధ్యం కాదని భావించి విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటారు. పరస్పర అంగీకారంతో ఈ వ్యవహారం కొన్నిసార్లు ఈజీ అయిపోతుంది. అయితే విడాకులకు సంబంధించిన కొన్ని షాకింగ్ కేసులు గతంలో చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన విడాకుల కేసు పలువురిని ఆలోచింపజేసింది. అసలు విషయం ఏమిటంటే..

    ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో పెళ్లి అయిన 40 రోజులకే  తర్వాత భర్త నుంచి విడాకులు తీసుకోవాలని కోర్టు మెట్లు ఎక్కింది ఓ భార్య. ఇక్కడ ఆమె విడాకుల కోసం చెప్పిన కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. తన భర్త రాజేష్ 40 రోజుల్లో ఆరుసార్లు మాత్రమే స్నానం చేశాడని, దీంతో అతడి శరీరం నుంచి దుర్వాసన తట్టుకోలేకపోయానని చెప్పింది. అంతేకాదు వారానికోసారి పవిత్రంగా భావించే గంగాజలాన్ని చల్లుకుంటాడని… ఇక అతడితో కలిసి జీవించడం తన వల్ల కాదని కోర్టును ఆశ్రయించింది.

    పెళ్లయిన నాటి నుంచి బలవంతంగా చేయించినా ఆరుసార్లు మాత్రమే స్నానం చేశాడు. దీంతో రాజేష్ భార్య కుటుంబ సభ్యులు ఆమె భర్త రాజేష్ పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఫ్యామిలీ కౌన్సెలింగ్ తర్వాత రాజేష్ శుభ్రంగా ఉండేందుకు రోజూ స్నానం చేసేందుకు అంగీకరించాడు. కానీ ఆ స్త్రీ అతనితో ఉండడానికి ఇష్టపడడం లేదు. దీంతో మరోసారి సెప్టెంబర్ 22న కౌన్సెలింగ్‌కు రావాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇలాంటి అరుదైన కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల కుర్ కురే ప్యాకెట్ ఇవ్వలేదని భర్త విడాకులు కోరిన ఘటన ఇటీవల ఆగ్రాలో జరిగిన సంగతి తెలిసిందే.

    Share post:

    More like this
    Related

    journalists : జర్నలిస్టులకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందా..? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో మరి!

    journalists : కరీంనగర్ లోని జర్నలిస్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం పండుగు పూట...

    prison : దసరా వరకు జైళ్లలో ఇష్టా భోజనం.. ఎందుకు పెడుతున్నారంటే?

    prison : జగత్తుకు అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణ. అలాంటి అమ్మ...

    Robots : మనుషులొద్దు.. రోబోలే ముద్దు.. వాటితో శృంగారానికి ప్రాధాన్యత

    Robots : శృంగారం విషయంలో మహిళల ఆలోచనలో మార్పు రానుందా? శృంగారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Maintenance Case : మెయింటెనెన్స్ విషయంలో భర్తకు మరో పనిష్మెంట్..

    Maintenance Case : మెయింటెన్స్ విషయంలో తన భార్యను ఇబ్బంది పెట్టాలనుకున్న...

    Madras High Court : భర్త ఆస్తి విషయంలో మద్రాస్ హై కోర్టు సంచలన వ్యాఖ్యలు..

    Madras High Court : ఈ మధ్య భార్య, భర్తల తగాదాలు...

    Divorce : కోర్టులో కూతురు కు విడాకులు..బారాత్ తో పండుగ చేసిన తండ్రి

    Divorce : కూతురు అంటే తండ్రికి ఎనలేని ప్రేమ. ఎంతో అపురూపంలో...

    Marriage : పెళ్లికి నో చెబుతున్నారా? తస్మాత్ జాగ్రత్త

    Marriage : పెళ్లి చేసుకోమంటే ప్రస్తుత యువత వణికిపోతున్నారు. పెళ్లి అంటేనే...