Women Police commission :
ఆమె చట్టానికి ప్రతినిధి. అక్రమాలను అడ్డుకోవాల్సిన బాధ్యతలు నిర్వహిస్తోంది. కానీ కంచే చేను మేసినట్లు ఆమెనే అక్రమాలకు పాల్పడితే ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తుంది. అడ్డదారుల్లో సొమ్ము సంపాదించేందుకు అందరు తాపత్రయపడుతున్నారు. ఇందులో భాగంగానే ఎంత దొరికితే అంత నొక్కుతున్నారు. అడ్డదారుల్లో సంపాదించి అందలాలు ఎక్కాలని చూస్తున్నారు. దీంతో అడ్డంగా బుక్కవుతున్నారు.
విశాఖ పట్నం కమిషనరేట్ లో హవాలా సొమ్ము పట్టుకోవాల్సిన ఓ పోలీస్ అధికారిణి అందులో పర్సంటేజీ కొట్టేసి వారిని పంపించేసింది. ఇది హవాలా సొమ్ము కాదని వారు ఎంత చెప్పినా వినలేదు. పైగా కేసు పెడతానని బెదిరించి వారి నుంచి రూ.2 వేల నోట్ల కట్టలు నొక్కేసింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
రూ. 90 లక్షల 500 నోట్లు ఇస్తే రూ. కోటి విలువైన రూ. 2 వేల నోట్లు ఇస్తామన్న ఒప్పందంతో డబ్బు చేతులు మారింది. అదే రోజు బీచ్ రోడ్డులో తనిఖీ చేస్తుండగా భారీ నగదు పట్టుబడింది. దీంతో మహిళా సీఐ ఆరా తీయగా కమీషన్ ప్రాతిపదికన నోట్లు మార్చేందుకు తీసుకెళ్తున్నట్లు తెలుసుకుని అందులో నుంచి రూ. 20 లక్షల రెండు వేల నోట్లు తీసుకుని వారిని పంపించింది. ఈ విషయం బయట చెబితే ఊరుకోనని హెచ్చరించింది. వారు ఎంత చెప్పినా వినకుండా తీసుకెళ్లింది.
బాధితులు తమ వద్ద ఉన్న ఆధారాలతో విశాఖ సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన అధికారులను రంగంలోకి దింపి వాస్తవాలపై ఆరా తీయిచారు. నిజమేనని తేలడంతో ఆమెను అరెస్టు చేయించేందుకు సిద్ధమయ్యారు. ఆమెకు అనుకూలంగా ఓ అధికార పార్టీ నేత పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఆమెకు సిక్ష పడకుండా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.






