A young women :
ఇటీవల కాలంలో ఆడపిల్ల/లు మోసపోతున్నామని తెలిసినా తప్పుడు పనులు మానడం లేదు. ఓ యువతి చేసిన తప్పిదం ఆమె పెళ్లినే రద్దు చేసింది. ముందు వెనక చూసుకోకుండా ప్రవర్తించడం వల్ల ఆమె భవిష్యత్ అంధకారంలో పడిపోయింది. పెళ్లి కావాల్సిన ఆమె జీవితం గందరగోళంలో పడిపోయింది. ఈనేపథ్యంలో ఆమె బంగారు భవిష్యత్ నాశనం అయింది.
గుడివాడ పట్టణానికి చెందిన ఓ యువతి ఫేస్ బుక్ ద్వారా ఓ యువకుడికి పరిచయం అయింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో అతడు ఆమెను న్యూడ్ గా ఫేస్ బుక్ లో మాట్లాడాలని కోరాడు. దీనికి అంగీకరించిన ఆమె అతడితో నగ్నంగా మాట్లాడింది. దీన్ని రికార్డు చేసిన అతడు ఆమెను బ్లాక్ మెయిల్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. సమయం కోసం వేచి చూశాడు.
ఈ నేపథ్యంలో ఆమెకు మరో వరుడితో వివాహం నిశ్చయం అయింది. ఇక పెళ్లి చేసుకుంటామని భరోసాతో అతడితో శారీరకంగా దగ్గరైంది. ఈ విషయం తెలుసుకున్న మొదటి వ్యక్తి పెళ్లి జరుగుతుందనే కారణంగా ఆమెను పెళ్లికి దూరం చేయాలని అనుకున్నాడు. తనతో నగ్నంగా మాట్లాడిన వీడియోను పెళ్లి కుమారుడికి పంపాడు. దీంతో అతడు వివాహాన్ని రద్దు చేసుకున్నాడు.
ఎవరో ఏమిటో తెలియకుండా ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా యువతి చేసిన పనికి భారీ మూల్యమే చెల్లించుకుంది. దీనికి కారణమైన వాడిపై 109, 120(బి) ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. వ్యక్తిగత వీడియోలను ఎంరైనా పంపితే వాటిని డిలీట్ చేయకుండా సామాజిక మాధ్యమాల్లో పంపితే వారికి జైలు శిక్ష తప్పదని పోలీసులు చెబుతున్నారు.