
Aadhi Pursh Movie : రామాయణం నేపథ్యంతో భారీ స్థాయిలో మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఆదిపురుష్ రిలీజ్ అయ్యి అప్పుడు రెండవ వారం లోకి అడుగు పెట్టింది.. ఈ సినిమా ఈ 9 రోజుల్లో తెచ్చుకున్న కలెక్షన్స్ ను ఒకసారి పరిశీలిస్తే.. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్’.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.
ముందు నుండి అన్ని భారీగా ఉండేలా ప్లాన్ చేసిన ఈ సినిమా టీజర్ తోనే లెక్క తప్పింది.. అప్పటి వరకు ఉన్న అంచనాలు పోయి నెగిటివ్ వైబ్స్ వచ్చేసాయి. అయితే ఎలాగో ఒకలా కస్టపడి మళ్ళీ పాజిటివ్ వైబ్స్ తెచ్చి రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనకు ఆదిపురుష్ టీమ్ కు చుక్కులు కనిపించాయి. కనీసం డార్లింగ్ ఫ్యాన్స్ ను కూడా మెప్పించలేక పోయాడు.
దీంతో మొదటి షో తోనే మిశ్రమ స్పందన తెచ్చుకుని ప్లాప్ అని తేలిపోయింది.. అయితే మొదటి మూడు రోజులు కలెక్షన్స్ బాగా రాబట్టిన ఈ సినిమా సోమవారం తర్వాత అసలైన పరీక్ష స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ వివరాలు ఒకసారి పరిశీలిద్దాం.. 240 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే 120 కోట్ల మేర చేసినట్టు రిపోర్ట్ వచ్చింది.
అయితే ఈ సినిమా సోమవారం నుండి గ్రాఫ్ మరింతగా పడిపోయింది.. ప్రస్తుతం ఈ సినిమా 400 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది.. ఇక నిన్న శనివారం 9వ రోజు కేవలం తెలుగులో 70 లక్షలు, వరల్డ్ వైడ్ గా 1.50 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్టు టాక్.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 60 కోట్లు రాబట్టాలి.. మరి ఇంత తక్కువ అంటే ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే అసాధ్యమే.. దీంతో ప్రభాస్ ఖాతాలో మరో ప్లాప్ ఖాయమే..
ReplyForward
|