Rahul leadership : విపక్షాల కూటమిలో మళ్లీ ‘కప్పల తక్కెడ’ మొదలైంది. బీజేపీపై పోరుకు ఒకరు కలిసి వస్తే మరొకరు దూరం అవుతున్నారు. ఇటీవల విపక్ష నేతలంతా బిహార్ లో సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, మమతా బెనర్జీ, ఇలా చాలా మంది బీజేపీ వ్యతిరేఖ నాయకులు కూటమిలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలో గద్దె దించాలనే లక్ష్యంతో పని చేయాలని నాయకులంతా ముక్త కంఠంతో చెప్పారు.
ఈ సమావేశంలో కేజ్రీవాల్, రాహుల్ గాంధీకి మధ్య వివాదం తలెత్తింది. ఇటీవల బీజేపీ ప్రభుత్వం దేశ రాజధానిపై ఆర్డినెన్స్ తెచ్చింది. దీన్ని కేజ్రీవాల్ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ ఆర్డినెన్స్ ఎత్తివేయాలని విపక్షాలను కూడగడుతున్నాడు కూడా. అయితే దీనికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పెద్దగా స్పందించడంలేదు. దీంతో కేజ్రీవాల్ ఆయనపై గుస్సాగా ఉన్నారు. రాహుల్ విపక్షాల నాయకుడిగా ఉంటే తాము మద్దతివ్వమని ఆప్ నేత ప్రియాంక కక్కర్ ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు.
ప్రియాంక కక్కర్ చేసిన ట్విట్ ఇప్పుడు విపక్షంలో కల్లోలం పుట్టిస్తుంది. కేంద్రం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతివ్వకుంటే, ఆ పార్టీ నేతృత్వంలో కొనసాగే విపక్షంలో తాము ఉండబోమని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. ‘దేశం బాగుండాలంటే మొదట కాంగ్రెస్, మరోసారి రాహుల్ గాంధీని నాయకుడిగా నిలబెట్టి విపక్షాలను కూడా అతడికి మద్దతివ్వమని అడగవద్దని, దేశ ప్రమోజనాల దృష్ట్యా రాజ్యాంగాన్ని పరిరక్షించడం కంటే కూడా ఇది చాలా ముఖ్యమైన విషయమమని’ ఆయె ట్విటర్ లో రాశారు.
విపక్షాలతో కలవడంతో పాటు ఢిల్లీ ఆర్డినెన్స్ కు మద్దతు కూడగట్టవచ్చని కోటి ఆశలతో కేజ్రీవాల్ బిహార్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ కూడా ఈ ఆర్డినెన్స్ కు మద్దతు ఇస్తుందని ఆయన ఆశ పడ్డారు. కానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం స్పందించలేదు. దానిపై కూలంకుశంగా చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాహుల్ సమాధానంతో కేజ్రీవాల్ ఏ మాత్రం తృప్తి పడలేదు. ఇక సమావేశం తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడకుండానే ఆయన వెనుదిరిగారు. ఆ తర్వాత కక్కర్ ఈ ట్వీట్ చేసింది.
ఒకవేళ ఢిల్లీ ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వకుంటే కేజ్రీవాల్ ఎట్టి పరిస్థితుల్లో విపక్షంలో కొనసాగరు. ఇంకా ఎన్నికలకు దాదాపు ఏడాది మాత్రమే గడువు ఉండడంతో ఇది సాధ్యం అవుతుందా..? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. విపక్షం నుంచి కేజ్రీవాల్ బయటకు వెళ్తే బీజేపీ ఓటమి భయం నుంచి కొంత మేర తప్పుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.