
Aamir Khan 3rd marriage : అమీర్ ఖాన్.. బాలీవుడ్ లోనే బడా హీరోల్లో ఈయన ఒకరు.. ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి తన నటనతో ఆడియెన్స్ ను కట్టిపడేసే సత్తా ఉన్న అమీర్ ఖాన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉంది.. ఈ మధ్య కాలంలో అంతగా హిట్స్ అందుకోలేక పోతున్న పర్సనల్ గా మాత్రం ప్రతీ నిత్యం బాలీవుడ్ లో వార్తల్లో నిలుస్తున్నాడు.
అమీర్ ఖాన్ కెరీర్ లో ఎన్నో ఏళ్లుగా స్టార్ హీరోగా రాణిస్తూ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుని సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.. నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా నిర్మాతగా కూడా ఈయన పని చేసాడు.. కానీ ఈయన వ్యక్తిగతంగా మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నాడు.. గత కొద్దీ రోజుల క్రితం అమీర్ ఖాన్ తన రెండవ భార్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే..
ఇక అప్పటి నుండి ఈయన మూడవ పెళ్లి చేసుకో బోతున్నాడు అంటూ వార్తలు రాగా.. తాజాగా బాలీవుడ్ మీడియాలో సోషల్ మాధ్యమాల్లో ఈ వార్తలు మరింత ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ఈయన ముందుగా 1986లో రీనా దత్తను పెళ్లి చేసుకోగా 2002 లో ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్న అమీర్ 2021లో విడాకులు తీసుకున్నారు..
అయితే మరో నటి కోసమే కిరణ్ రావుకు విడాకులు ఇచ్చాడని అప్పట్లో రూమర్స్ వచ్చాయి.. అదే నిజం చేస్తూ ఈయన దంగల్ మూవీలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన నటి ఫాతిమా సన షేక్ తో ప్రేమలో ఉన్నట్టు తర్వాత తెలిసింది. .అపప్టి నుండి వీరు పలుసార్లు బయట కూడా కనిపించారు.
తాజాగా ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి.. ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ కూతురు వయసు ఉన్న ఆమెతో పెళ్లి ఏంటి అని నెటిజెన్స్ చురకలు వేస్తున్నారు.. చూడాలి మరి త్వరలోనే పెళ్లి అనే వార్తలపై ఈ జంట నుండి ఎలాంటి స్పందన ఇస్తుందో..