Aamir Khan as villain : వారిద్దరూ అనితర సాధ్యులే. ఒకరు దర్శక దిగ్గజం కాగా మరొకరు కథానాయకుల్లో అగ్రగణ్యుడు. ఇక వీరిద్దరు కలిసి సినిమా తీయాలనే కోరిక చాలా కాలంగా వస్తోంది. ఆ కల ఇప్పటికి నెరవేరే సమయం దగ్గరపడుతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమా కోసం అందరు కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు.
తమ అభిమాన హీరోను రాజమౌళి ఎలా చూపిస్తాడోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలోవారి కాంబినేషన్ పై అందరిలో ఆతృత పెరుగుతోంది. సినిమాపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటిస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన దీపికా పడుకొనే నటిస్తోందని చెబుతున్నారు.
ఇలా రోజుకో విధంగా పుకార్లు పుట్టిస్తున్నారు. సినిమా కథ తయారయ్యే సరికి ఆగస్టు వస్తుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ చెబుతున్నారు. ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రకటన కొద్ది రోజుల్లో రానుంది. దీంతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
సినిమా రెండు పార్టులుగా ఉంటుందని అంటున్నారు. కేఎల్ నారాయణ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమాలో మహేశ్ బాబును మరో కోణంలో చూడబోతున్నారు. గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా రూపొందించనున్నారు. దీనికోసం రాజమౌళి ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.