టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం కూలీ. ఈ సినిమాను గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా నటిస్తున్నారు. నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. అంతే కాకుండా కూలీ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అమీర్ తన పార్ట్ షూటింగ్ వచ్చే వారం చెన్నైలో ప్రారంభించనున్నారు. కూలీలో బంగారం స్మగ్లింగ్ మాఫియా బ్యాక్‌డ్రాప్ ఉంటుందని చెబుతున్నారు. ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు.
Breaking News
Aamir Khan : సూపర్ స్టార్లు సినిమాల్లో అతిధి పాత్రలు చేయడం ఇటీవల ట్రెండ్‌గా మారింది. స్ట్రీ 2 లోని అక్షయ్ కుమార్ నుండి సింఘమ్ ఎగైన్‌లో సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ వరకు అతిధి పాత్రల సీజన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అమీర్ ఖాన్, తమిళ సినిమా లెజెండ్ రజనీకాంత్ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కలిసి నటించనున్నారు. వారిద్దరూ ఆటంక్ హాయ్ ఆటంక్ (1995) తర్వాత తెరపై మళ్లీ కలుస్తున్నారు . తమిళ సూపర్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్ కూలీలో అమీర్ ప్రత్యేక అతిథి పాత్రలో నటించేందుకు సిద్ధంగా ఉన్నాడు .