
Abhiram Ahimsa : డైరెక్టర్ తేజ తెలియని తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులు లేరు అనే చెప్పాలి.. ఈయన ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ లవ్ స్టోరీలను తెరకెక్కించాడు.. ఇప్పటికీ తేజ తెరకెక్కించిన సినిమాలు ఇంకా ఫ్రెష్ గా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.. ఈయన చిత్రం, నువ్వు నేను, జయం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు..
కానీ ఆ తర్వాత మళ్ళీ అలాంటి రొటీన్ లవ్ స్టోరీలనే తెరకెక్కించి ప్లాప్ లను కూడా అందుకున్నాడు.. ఇక ప్లాప్స్ రావడంతో తేజ లాంగ్ గ్యాప్ తీసుకుని నేనే రాజు నేనే మంత్రి సినిమాను తెరకెక్కించాడు. రానా, కాజల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాతో మళ్ళీ హిట్ బాటలోకి వచ్చేసాడు.. ఇదిలా ఉండగా తేజ్ తాజాగా రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ తో అహింస సినిమాను చేస్తున్నాడు..
నిర్మాత డి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ కథానాయకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు.. ఈ సినిమాను ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి కిరణ్ నిర్మిస్తున్నారు.. ఈ సినిమా జూన్ 2 న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.. ఇప్పటికే అహింస నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ బాగానే అంచనాలను క్రియేట్ చేసింది.
ఇక ఈ రోజు మేకర్స్ నుండి మరో అప్డేట్ వచ్చింది. మరో 10 రోజులు మాత్రమే రిలీజ్ అవ్వడానికి సమయం ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ ను రిలీజ్ చేసారు.. ఇక ఈ సినిమాలో సదా, గీతికా, రజత్ బేడీ, కల్పలత వంటి వారు కీలక పాత్రలను పోషిస్తుండగా ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.. చూడాలి దగ్గుబాటి వారసుడిగా తేజ హిట్ అందిస్తాడో లేదో..!