
Vaastu toys : మనం పక్కా వాస్తు ప్రకారం ఉండాలని కోరుకుంటాం. అందులో సందేహం లేదు. కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఇల్లు కొనుక్కోవాలన్నా వాస్తు ప్రకారం ఉంటేనే ముందడుగు వేస్తాం. లేదంటే కొనడానికి ఇష్టపడం. ఇలా వాస్తు మన జీవితంతోనే ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో వాస్తు పక్కాగా ఉంచుకుంటేనే మనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. లేదంటే అన్ని సమస్యలు మనల్ని వేధిస్తాయి.
ఇంట్లో మనకు మంచి జరగాలంటే కొన్ని ఫొటోలు, చిత్రాలు ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో జంట ఏనుగుల బొమ్మ లేదా చిత్రం ఉంటే ఇంట్లో మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇలాంటి ఫొటో పెట్టుకుంటే ఇంట్లో సమష్టి తత్వం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇలాంటి పరిహారాలు పాటిస్తే ఎంతో మంచిది.
ఇంట్లో తాబేలు బొమ్మ, ఫొటో ఉన్నా మంచిదే. దీని వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తాబేలు శ్రీ మహా విష్ణువుకు ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే తాబేలు బొమ్మ ఉంచుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. ఇంట్లో జంట హంసల బొమ్మ ఉంచుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇది కూడా అనుకూలతలు పెంచుతుంది.