Actor Mohanlal : కేరళలోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడడంతో మృతుల సంఖ్య శనివారం నాటికి 358కి చేరుకుంది. మోహన్ లాల్ టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్. సైనిక శిబిరానికి చేరుకున్న ఆయన సహాయక చర్యలకు నాయకత్వం వహిస్తున్న అధికారులతో మాట్లాడారు. విపత్తు తీవ్రతను ప్రత్యక్షంగా చూస్తేనే అర్థమవుతుందన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు విభాగాలు రెస్క్యూ ఆపరేషన్ లో భాగమైన స్థానిక ప్రజలు అద్భుతంగా పనిచేశారని అన్నారు.
ఈ సందర్బంగా మోహన్ లాల్ వయనాడ్ కు బారీ విరాళం ప్రకటించారు. వయనాడ్ బాధితులకు పునరావాసాల కోసం మోహన్ లాల్ ఫౌండేషన్ ద్వారా రూ.3 కోట్లే అందించనున్నట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరింత ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు.