33.2 C
India
Monday, February 26, 2024
More

    Actor Nagababu Family : నాగబాబు ఫ్యామిలీకి ఓటు హక్కు కల్పించిన ఏపీ అధికారులు

    Date:

    Actor Nagababu Family
    Actor Nagababu Family

    Actor Nagababu Family : ఏపీలో దొంగ ఓట్ల కలకలం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. వైసిపి పైన టిడిపి, టిడిపి పైన వైసిపి నేతలు ఆరోపణలు చేసుకుంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. రాష్ట్రంలో నకిలీ ఓటర్లను చేర్చి వైసిపి వచ్చే ఎన్నికల్లో ఓట్లు సంపాదించాలని ప్రయత్నాలు చేస్తుందంటూ టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో దొంగ ఓట్లు నమోదు అయ్యేంటే వాటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మా పైన అనవసరంగా బురద జల్లుతున్నారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కలిసి విన్నవించారు.

    తాజాగా   నాగబాబు, ఆయన భార్య, కూతురు నిహారిక, కుమారుడు వరుణ్‌తేజ్‌ (సినీ నటుడు), కోడలు లావణ్య త్రిపాఠి (సినీ నటి) కలిపి మొత్తం ఆరుగురు తాడేపల్లి పట్టణ పరిధిలో వడ్డేశ్వరం-రాధా రంగ నగర్‌లోని 5–263 ఇంటి అడ్రసులో నివాసం ఉంటున్నట్లు పేర్కొంటూ ఓట్లు నమోదు ఫారాన్ని అన్‌లైన్‌లో నమోదు చేశారు.అయితే ప్రాథమిక స్థాయిలో బూత్‌ లెవల్‌ అధికారి (బీఎల్‌వో) పరిశీలనలో నా­గబాబు గానీ, వారి కుటుంబం గానీ ఆ అడ్రసులో నివాసం ఉండడం లేదని తేలింది. ఈ ఇల్లు జనసేన పార్టీ అభిమానిదని స్థానికులు పేర్కొన్నారు.

    ఇలా తెలంగాణలో ఉన్న నాగబాబు కుటుంబం ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ నాయకుల అడ్రస్సులతో ఓటర్ కార్డులు కలిగి ఉన్నారని స్పష్టం అవుతుంది. వాస్తవంగా ఎక్కడ ఓటు హక్కు ఉంటుందో అదే రాష్ట్రంలో ఓటర్ కార్డు కలిగి ఉండాలి. అలాకాకుండా నాగబాబు కుటుంబం ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో  ఓటర్లగా ఎందుకు నమోదు అయ్యారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసిపి నేతలే దొంగ ఓటర్లను నమోదు చేయిస్తున్నారని ఆరోపణ చేసేవారు ఈ విషయాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Srutanjay Narayanan IAS : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు ఐఏఎస్.. కోచింగ్ తీసుకోకుండానే 75వ ర్యాంక్

    Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే...

    Sameera Reddy : అప్పట్లో సైజ్ పెంచమని తెగ ఇబ్బంది పెట్టేవారు.. సమీరా రెడ్డి హాట్ కామెంట్స్

    Sameera Reddy : తెలుగు ఇండస్ట్రీపై అందం, అభినయంతో ఎంతో మంది...

    India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

    India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

    Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

    Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related