Actor Sai Kiran Marriage : నువ్వే కావాలి చిత్రం ద్వారా ప్రేక్షకుల ఆదరణ పొందిన నటుడు సాయికిరణ్ అనంతరం హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో నటిస్తున్నాడు. ఇటీవలే తన సహనటి స్రవంతిని పెళ్లాడాడు. ఇది అతనికి రెండో పెళ్లి. సాయికిరణ్ తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి.. అమ్మాయి ఎవరని ఆరాతీస్తున్నారు.
సాయికిరణ్‌కి అప్పటికే వైష్ణవి అనే అమ్మాయితో వివాహమైంది. వీరికి ఒక కూతురు ఉంది. వ్యక్తిగత విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సాయికిరణ్ ఒంటరిగా ఉంటున్నాడు. అతను ఇటీవల నటించిన కోయిలమ్మ సీరియల్ లో నటించిన తన సహనటి స్రవంతితో ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు పెళ్లితో వీరిద్దరూ ఒక్కటయ్యారు. నటీనటులు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.
View this post on Instagram