Actress Aamani :
అలనాటి సావిత్రీ తర్వాత అంతే అందం, అభినయం కలబోతగా వచ్చిన హీరోయిన్ సౌందర్య. తక్కువ సమయంలోనే వందకు పైగా సినిమాల్లో నటించిన ఆమె చిన్న వయస్సులోనే తన అభిమానులను విడిచిపెట్టి వెళ్లిపోయింది. హెలీకాప్టర్ ప్రమాదంలో ఆమె మరణించిందని వార్తల తెలియడంతో అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ కాలంలో తెలుగుతో పాటు కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు ఏర్పడిందంటే సందేహం లేదు.
నేటికీ ఆమెను అభిమానించే వారు లేకపోలేదు. కొందరు హీరోయిన్స్ జీవిత కాలం పాటు పని చేసి సంపాదించుకున్న పేరు, కీర్తిని ఆమె తక్కువ సమయంలోనే సంపాదించుకుంది. సినిమాలోనే కాకుండా బయట కూడా ఆమె చాలా గొప్పదని చెప్తున్నారు ఆమని. సౌందర్య సమకాలీన నటులతో మంచి ఫ్రెండ్ షిప్ చేసేది. ఆమని కూడా సౌందర్యకు బాగా దగ్గరైన ఫ్రెండ్. తను కన్నడ సినిమాలో చేస్తున్న సమయంలో ఆమనిని తీసుకొని వెళ్లేది సౌందర్య.
సౌందర్య గురించి, ఆమె తల్లి, ఆమె తండ్రి గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఆమని కన్నీటి పర్యంతమైంది. బెంగళూర్ లో సౌందర్య నివాసం ఉండేదని వాళ్లింట్లో నిత్యం పండుగలా గడిచేదని చెప్పింది. తండ్రి మాట రాముడు ఎలా జవదాటలేదో సౌందర్య కూడా తండ్రి మాటకు కట్టుబడి ఉండేది. ఆమె చనిపోయిందన్న వార్త వినగానే చాలా బాధపడ్డానని చెప్పింది. చూసేందుకు రావాలని కొందరు కోరినా వెళ్లలేదు. అక్కడ ఏముంటుంది కాలిపోయిన బూడిద తప్ప అని మంచి ఫ్రెండ్ ను కోల్పోయానిని బాధ ఇప్పటికీ ఉందని చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే ఆమె అమ్మగారు కూడా చనిపోయారట. కొన్ని రోజులకు ముందు బెంగళూర్ లోని సౌందర్య ఇంటికి వెళ్లి వారి తల్లిని పలకరిద్దాం అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత వారి ఇళ్లును చూస్తే అంతా బూజు పట్టి బూత్ బంగ్లా లాగా మారిపోయిందని చెప్పింది.