27.7 C
India
Saturday, May 17, 2025
More

    Actress Hema : నటి హేమ అరెస్టు.. ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడనుందో తెలుసా?

    Date:

    Actress Hema
    Actress Hema

    Actress Hema : బెంగళూరు రేవ్ పార్టీలో రెడ్ హ్యాండెడ్‌గా తెలుగు నటి హేమ దొరికిన విషయం తెలిసిందే.  ఆమెకు రెండు సార్లు బెంగళూరులోని పోలీసులు నోటీసులు పంపగా.. హాజరుకాలేదు. ఒకసారి జ్వరం వచ్చిందని, మరోసారి వ్యక్తిగత సమస్యలతో రాలేనని చెప్పారు. మూడోసారి నోటీసులు పంపగా చివరకు ఆమె హాజరయ్యారు.  డ్రగ్ పార్టీ అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అయితే ఆమెకు పాజిటివ్ రావడంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు.

    సోమవారం బెంగళూరులో హేమ విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు అరెస్టు చేసి తీసుకెళుతున్న సమయంలో హేమ మాట్లాడుతూ.. రేవ్ పార్టీలో నేను లేను. కేవలం బర్త్ డే తర్వాత ఇంటికి వెళ్లిపోయాను. నేను చేసిన వీడియో కూడా హైదరాబాద్ లోనే  ఉండి చేశాను. నేను ఎలాంటి తప్పు చేయలేను కావాలనే నన్ను ఈ కుట్రలో ఇరికిస్తున్నారని హేమ వాపోయారు.

    బెంగళూరులో హేమను విచారించిన తర్వాత ఆమెకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. మంగళవారం ఆమెను మళ్లీ కోర్టులో హాజరుపర్చనున్నారు. అనంతరం ఆమెను కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. కస్టడీకి అప్పగిస్తే ఆమె నుంచి నిజాలు రాబట్టే అవకాశం ఉంది.

    ఒకవేళ హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిజమైతే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చట్టాల ప్రకారం.. హేమకు మూడు సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.  అయితే తెలంగాణలో డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితులుగా పరిగణిస్తే.. కర్ణాటకలో మాత్రం దోషులుగా చూస్తారు. కర్ణాటక లో చట్టాల ప్రకారం..  డ్రగ్స్ అమ్మినా తీసుకున్నా.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. హేమ న్యాయపరంగా పోరాటం చేస్తానని అసలు డ్రగ్స్ తీసుకోలేదని చెబుతోంది. తెలుగు సినీ నటీనటులు దొరికారని చెబుతున్నా.. కేవలం హేమను హైలైట్ చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Hema : బెంగళూరు రేవ్ పార్టీ నిందితుల్లో నటి హేమ.. పోలీసుల చార్జిషీట్

    Actress Hema : కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులో సంచలనం సృష్టించిన...

    Actress Hema : సినీనటి హైమపై ‘మా’ సస్పెన్షన్ ఎత్తివేత

    actress Hema : సినీనటి హేమకు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా)...