Actress Kasturi :
కస్తూరి శంకర్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బుల్లితెర నుండి వెండితెర వరకు అందరికి ఈమె పేరు పరిచయమే.. 1990 లలోనే ఈమె హీరోయిన్ గా నటించింది.. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సీరియల్స్ చేస్తూ బాగానే వెనకేస్తుంది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న గృహలక్ష్మి సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక అప్పటి నుండి ఈమె సోషల్ మీడియాలో కూడా సందడి మొదలయ్యింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అనవసరమైన విషయాల్లో కూడా స్పందిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ఈమె చేసే వివాదాస్పద కామెంట్స్ వల్ల ఈమె పేరు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ భామ ఒక ఎమ్మెల్యే బంధువు చేసిన పనిపై తెగ ఫైర్ అయ్యింది. ఈ విషయం సీఎం వరకు వెళ్లడంతో ఇప్పుడు సంచలనంగా మారింది.
తాజాగా అమానవీయ చర్యకు సంబంధించిన ఒక వీడియో వైరల్ కాగా ఈ వీడియో ప్రతీ ఒక్కరిని కలిచి వేసింది. మద్యం మత్తులో సిగరెట్ కలుస్తూ ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి రోడ్డు పక్కన కూర్చున్న యువకుడిపై మూత్ర విసర్జన చేసాడు. అలా చేస్తున్న ఆ యువకుడు ఏం చేయలేని పరిస్థితిలో కనిపించాడు.. ఈ వీడియోపై కస్తూరి స్పందిస్తూ అతడిపై ఫైర్ అయ్యింది.
కుక్కలు కూడా అలా చేయాలనీ అనుకోవు.. ఆ సిక్కో అయిన ప్రవేశ్ శుక్లా మధ్యప్రదేశ్ లోని బీజీపీ ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లాకు బంధువు అంటున్నారు. అతడిని శిక్షిస్తారా? లేదా? అంటూ ఈమె రాసుకొచ్చింది. ఈమె చేసిన కాసేపటికే మధ్యప్రదేశ్ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సీఎం శివరాజ్ సింగ్ కూడా ఈ విషయాన్నీ ట్వీట్ చేసారు. దీంతో ఈమె ఈ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ”వావ్ క్విక్ రియాక్షన్.. ఈ విషయం గురించి ఇప్పటికే సీఎం తెలుసుకున్నారు” అంటూ చెప్పుకొచ్చింది.