Kavya Kalyan Ram :
మన సినిమా పరిశ్రమలో చాలా మంది బాల నటులుగా వచ్చిన వారే. గంగోత్రి సినిమాతో కావ్య కల్యాణ్ రామ్ బాలనటిగా అరంగేట్రం చేసింది. తరువాత అల్లు అర్జున్, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ వంటి వారితో సినిమాలు చేసింది. ఇప్పుడు హీరోయిన్ గా మారి మసూద, బలగం సినిమాల్లో నటించింది. అందరిని మెప్పించింది. రెండు సినిమాలు హిట్ కావడంతో ఇక సినిమాల పరంపర కొనసాగిస్తోంది.
ప్రస్తుతం ఉస్తాద్ సినిమాలో నటిస్తోంది. ఇందులో కీరవాణి కుమారుడు శ్రీ సింహ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కావ్య చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో దర్శక నిర్మాతలు తన శరీరాకృతి మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని బాధపడింది.
నీ శరీరంలో భాగాలు పెద్దవిగా ఉన్నాయని అవమానించారని చెబుతోంది. కానీ ఇప్పుడు మంచి రేసు మీద ఉన్న హీరోయిన్ గా గుర్తింపు పొందుతున్న క్రమంలో వారు మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తే బాధ వేస్తుందని చెబుతోంది. ప్రస్తుతం కావ్య తెలుగులో మంచి అవకాశాలు తెచ్చుకుంటోంది. దీంతో రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని ఆఫర్లు దక్కించుకుంటుందని అభిప్రాయపడుతున్నారు.
కావ్య మసూద, బలగం సినిమాలతో తానేంటో నిరూపించుకుంది. ఇప్పుడు అగ్రహీరోలతో జతకట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాడీలోని పార్ట్స్ పెద్దగా ఉన్నాయని వారి మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తోంది. కావ్య ఇప్పుడు తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఆఫర్ల కోసం ఎదురుచూడకుండా అవే ఆఫర్లు దగ్గరకు రావడం గమనార్హం.