Actress Poonam Kaur : నటి పూనమ్ కౌర్ గురించి అందరికి తెలుసు.. ఈ భామ గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న పెద్దగా రాణించడం లేదు.. అయితే పూనమ్ కౌర్ హీరోయిన్ గా ఉన్నప్పటి కంటే సినిమాలు ఆపేసిన తర్వాతనే బాగా ఫేమస్ అయ్యింది.. ఎందుకో అందరికి తెలుసు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.
మహిళల గురించి ప్రతీ విషయంలో గళమెత్తుతూ మహిళలకు న్యాయం జరగాలంటూ పలు కామెంట్స్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఎప్పుడు పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.. ఈమె చేసిన కామెంట్స్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ అమ్మడిపై గరంగరంగా ఉన్నారు.
ఇదిలా ఉండగా పూనమ్ కౌర్ తాజాగా మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈమె టాలీవుడ్ స్టార్ హీరో గురించి ఒక స్టార్ డైరెక్టర్ కు ఫోన్ లో చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఆడియో క్లిప్ వైరల్ కాగా ఇప్పుడు ఈ అమ్మడు గురించే అంత చర్చించు కుంటున్నారు.
ఈ భామ ఎప్పుడు ఏ హీరోను టార్గెట్ చేస్తుందో తెలిసిందే.. మరోసారి ఆ హీరో పేరు చెబుతూ ఆయన చేసిన పనులను చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ డైరెక్టర్ తో మాట్లాడిన ఆడియో వైరల్ అవుతుంది.. ముఖ్యంగా వైసీపీ సభ్యులు ఈ ఆడియో క్లిప్ ను తెగ షేర్ చేస్తున్నారు.. ఎందుకంటే ఇది వారికీ బాగా ఉపయోగపడే విషయం అని చెప్పాలి. మొత్తానికి ఈమె నిజంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేసిందో లేదంటే ఇది ఫేక్ ఆడియో క్లిప్ నో తెలియదు కానీ ఇది మాత్రం సంచలనం అయ్యింది.
నటి పూనం కౌర్ ఆడియో లీక్.
అందరూ వినండి పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడో..@PawanKalyan @kotarukmini pic.twitter.com/j0BBI9IiKE
— varra Raveendra Reddy (@varra1987) November 22, 2023