Shilpa Shetty’s Husband :
ప్రముఖ నటి శిల్నాశెట్టి భర్త రాజ్ కుంద్ర పోర్న్ వీడియోల కేసులో జైలుకు వెళ్లొచ్చాడు. ప్రస్తుతం మీడియాను తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎటైనా బయటకు వెళ్లాలంటే ఒంటరిగానే వెళ్తున్నాడు. వైవాహిక జీవితంలో రాజ్ కుంద్ర ఎన్నో విషయాలు పంచుకున్నాడు. గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుని తన మనసులోని మాటలను గుర్తు చేసుకుంటున్నాడు.
పెళ్లయిన కొత్తలో శిల్పాశెట్టి ఎంతో క్రమశిక్షణగా ఉండేది. పార్టీలకు ఇతర విందు వినోదాలకు వెళ్లేది కాదు. రాత్రి 9 అయిందంటేనే నిద్ర పోయేది. దీంతో ఏదైనా పార్టీలకు వెళ్లేటప్పుడు మరదలు షమితా శెట్టిని తీసుకుని పోయేవాడట. అలా శిల్పాశెట్టి తన భర్తను ఫ్రీగా వదిలిపెట్టేదట. అలా బావా మరదళ్లు రాత్రి సమయంలో పార్టీలకు వెళ్లి వచ్చేవారట. దానిపై శిల్పాశెట్టి శ్రద్ధ చూపేది కాదని చెబుతున్నాడు.
శిల్పాశెట్టికి తెలియకుండా చాలా సార్లు మేమిద్దరం బయటకు వెళ్లాం. ఆమెకు చెప్పేవారం కాదు. శిల్ప తొందరగా నిద్ర పోవడంతోనే తాము రాత్రి పూట విందులకు కలిసి వెళ్లేవాళ్లం. బయటకు వెళ్లాలంటే షమితనే పిలిచేవాడినని రాజ్ కుంద్ర చెప్పాడు. శిల్ప పేరు కూడా గుర్తుకు వచ్చేది కాదు. అలా మేం చాలా పార్టీలకు వెళ్లేవారం. దీంతో రాజ్ కుంద్ర మాటలకు అందరు ఆశ్చర్యపోయారు.
పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్ర అరెస్ట్ కావడంత శిల్పాశెట్టి అతడి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక దశలో విడాకులు తీసుకుంటారనే వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని అంటున్నారు. ఈనేపథ్యంలో రాజ్ కుంద్ర ఇప్పుడు కూడా తలెత్తుకుని తిరడం లేదు. పోర్న్ వీడియోల కేసులో అరెస్టు కావడంతో చాలా మంది విమర్శించారు. దీంతో ఇప్పుడు రాజ్ కుంద్ర మాటలు వైరల్ గా మారుతున్నాయి.