Varalakshmi Sarath Kumar :
నవ్వినా నాపచేనే పండుద్ది అంటారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని పెద్దలు చెబుతారు. ఎక్కడైతే అవమానం జరుగుతుందో అక్కడే మన కీర్తి నిలబెట్టుకోవాలి. ఇది అక్షరాల వరలక్ష్మీ శరత్ కుమార్ చేసింది. మొదట తన గొంతు బాగా లేదని హేళన చేశారట. అచ్చం మగాడి గొంతులా ఉంది నువ్వు పరిశ్రమకు పనికి రావని చెప్పారట. కానీ ఆమె ఆ మాటలకు నొచ్చుకోలేదు. బంతిని ఎంత స్పీడుగా కొడితే అంతే స్పీడుగా వస్తుందన్నట్లుగా తనకు జరిగిన అవమానాలను దిగమింగుకుని నటన మీదే దృష్టి పెట్టింది.
తెనాలి రామకృష్ణ ఎల్ఎల్ బీ లో నచించినా తరువాత క్రాక్ లో మంచి పేరు తెచ్చుకుంది. జయమ్మగా నటించి నూటికి నూరు మార్కులు కొట్టేసింది. క్రాక్ లో ఆమె నటన చూసి అందరు షాకయ్యారు. అంతలా నటించి మెప్పింది. ఇక వీరసింహారెడ్డిలో బాలకృష్ణ చెల్లి పాత్రలో నటించి అందరి హృదయాలను గెలుచుకుంది. నటనలో తనకెదురు లేదని చాటింది. తన గొంతుతోనే డబ్బింగ్ చెప్పుకుంది.
ప్రారంభంలో హేళన చేసిన వారే ఇప్పుడు ఆమె విశ్వరూపం చూసి ఫిదా అవుతున్నారు. ఆమెలోని నటనకు ఆశ్చర్యపోతున్నారు. గొంతు గంభీరంగా ఉండటంతో వెక్కిరించారట. ప్రస్తుతం ఆమె పాత్రలకు ఆమె డబ్బింగ్ కూడా చెబుతోంది. అందుకే ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో ఎవరికి తెలుసు. ఎవరిని కూడా హేళన చేయడం మంచిది కాదు.
మొదట హీరోయిన్ గా చేసిన ఆమె తరువాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కొనసాగుతోంది. ఇప్పుడు లేడీ విలన్ గా కూడా తనదైన శైలిలో రాణిస్తోంది. స్టార్ యాక్టర్ గా మారిపోయింది. సమయం వచ్చినప్పుడు అందరు తమ ప్రతిభను బయట పెడతారు. అలా వరలక్ష్మీ శరత్ కుమార్ తన టాలెంట్ నిరూపించుకోవడానికి కాస్త సమయం పట్టింది.