
Adavi Ramadu : మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.. ఈ విషయం తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నందమూరి ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగు తున్నాయి..
సీనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజల విశేష అభిమానాన్ని పొందారు.. ఈయనను ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఈసారి ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి.
అవన్నీ ఇప్పటికీ టీవీల్లో ప్రసారం అవుతుంటే చూస్తూనే ఉన్నారు. మరి ఎన్టీఆర్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఏది అంటే ”అడవి రాముడు” అనే చెప్పాలి. 1970 లలోనే ఎన్టీఆర్ ను మాస్ హీరోగా ప్రెజెంట్ చేసిన సినిమా ఇది.. అందుకే ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా అప్పట్లోనే బాక్సాఫీస్ దగ్గర సంచలన రికార్డులను నెలకొల్పింది.
ఇప్పటికే అడవి రాముడు సినిమా లోని పాటలు ఎవర్ గ్రీన్ హిట్ అనే చెప్పాలి. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్, జయసుధ లపై వచ్చిన ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పాటలు వింటూనే ఉన్నాం.. మరి ఈ స్థాయిలో మెప్పించిన ఈ సినిమాను ఎన్టీఆర్ శత జయంతి కానుకగా మే 28న రీ రిలీజ్ చేయబోతున్నారు.. దీని ద్వారా వచ్చే డబ్బును ఛారిటీకి ఇవ్వనున్నారు..