Adimulam : తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ బహిష్కృత నేత ఆదిమూలం మరోసారి వార్తల్లో నిలిచారు. అతని ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. ఆయన అసభ్యంగా మాట్లాడిన ఒక ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవల ఒక మహిళపై లైంగికదాడి ఘటన మర్చిపోక ముందే మరో వివాదంలో చిక్కుకున్నారు. లీకైన ఆడియో టేపులో ఏం ఉందంటే?
‘కలర్ మారిపోయావు.., పర్సనాలిటీ పెరిగిపోయింది.., అప్పటికీ ఇప్పటికీ బ్యూటిఫుల్‌గా ఉన్నావు. అప్పటికీ.., ఇప్పటికీ సూపర్ గా ఉన్నావు. చాలా అందంగా ఉన్నావు’ అంటూ ఒక మహిళతో మాట్లాడిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇలా అసభ్యంగా సంభాషిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. గత నెలలో ఒక మహిళపై లైంగికదాడి ఘటనలో అడ్డంగా బుక్కయిన ఆయన మళ్లీ అదే పంథా అనుసరిస్తున్నారు. ఇటీవల బయటపడిన ఆడియో క్లిప్ తో ఎమ్మెల్యే తీరుపై నియోజవర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయనను టీడీపీ పార్టీ గతంలోనే బహిష్కరించింది.
కోనేటి తనపై లైంగికదాడి చేయడమే కాక.. తన వర్గీయులను వేధిస్తున్నారంటూ కేవీబీపురం మండల, టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి ఆరోపించింది. బాధిత మహిళపై సానుభూతి చూపకుండా.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారని మీడియా ఎదుట వాపోయింది. ఇక ‘ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. ఏది ఏమైనా మరోసారి ఆదిమూలం మ్యాటర్ బయట పడడంతో సత్యవేడు ఆగ్రహంతో ఉంది.